గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీలో రచ్చ.. ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ వ్యవహారం ... స్పందించిన అంబటి

|
Google Oneindia TeluguNews

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో, సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. వైసీపీలో అంతర్గత కలహాలను బహిర్గతం చేస్తుంది. ఒక ఎమ్మెల్యే అక్రమాల మీద కార్యకర్తలు పిల్ వెయ్యటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అంబటి రాంబాబు కూడా స్పందించారు . పిల్ వేసిన వారిపై ఎదురు దాడికి దిగారు.

 ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి .. క్యాబినెట్ హోదా కూడా !! ఏపీ ప్రభుత్వ సలహాదారుగా కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి .. క్యాబినెట్ హోదా కూడా !!

ఎమ్మెల్యే అంబటి అక్రమ మైనింగ్ ... హైకోర్టులో పిల్ వేసిన వైసీపీ కార్యకర్తలు

ఎమ్మెల్యే అంబటి అక్రమ మైనింగ్ ... హైకోర్టులో పిల్ వేసిన వైసీపీ కార్యకర్తలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైసిపి కార్యకర్తలు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తమ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ లకు పాల్పడుతున్నారు అంటూ హైకోర్టులో పిటిషన్ వేయించారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి అధికార పార్టీలో అంతర్గత కలహాలను రోడ్డున పెట్టారు.వైసీపీ కార్యకర్తలు వేయించిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

ప్రతిపక్షాలకు ఆయుధంగా అంబటి వ్యవహారం

ప్రతిపక్షాలకు ఆయుధంగా అంబటి వ్యవహారం

సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో అంబటి రాంబాబు ఆయనతో పాటు మరో 8 మంది అనుచరులు అక్రమ మైనింగ్ పై పాల్పడుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని వైసిపి కార్యకర్తలు తరఫున న్యాయవాది నాగ రఘు పిటిషన్ దాఖలు చేయడం వైసిపి వర్గాల్లోనూ, అటు రాష్ట్ర వ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలకు ఆయుధమైంది. అంబటి అక్రమ మైనింగ్ పై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు .

జగన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వాదనలు

జగన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ వాదనలు

ఇదే పిటిషన్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్టు గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, కలెక్టర్ కు , ఏకంగా సీఎం జగన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే కోర్టును ఆశ్రయించినట్లుగా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికీ స్థానిక మైనింగ్ అధికారులు విచారణ జరపాలని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన వారే పిటిషన్ దాఖలు చేస్తే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒక పార్టీ కార్యకర్త అదే పార్టీకి చెందిన వ్యక్తిపై పిల్ వెయ్య వచ్చా ? దీనిపై సుప్రీం తీర్పులు ఏమైనా ఉన్నాయా ? ఆ వివరాలను తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Recommended Video

భగవంతుడి దయ తోనే అంటూ.. Vijayasai Reddy ట్వీట్ || Oneindia Telugu
నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన కోర్టు .. పిల్ వేసిన వారిపై అంబటి ఎదురు దాడి

నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన కోర్టు .. పిల్ వేసిన వారిపై అంబటి ఎదురు దాడి

అక్రమ మైనింగ్ పై వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది . కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ వ్యవహారంపై ఏపీలో పెద్దఎత్తున చర్చ జరుగుతుండగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అక్రమ మైనింగ్ కు ప్రయత్నించి విఫలం చెందినవారే పిల్ వేసిన అల్లరి చేయాలని ప్రయత్నిస్తున్నారని దీనిపై తమ వ్యతిరేక మీడియా, ప్రత్యర్థి రాజకీయ పక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు అక్రమాలకు అవినీతికి పాల్పడే ప్రశ్నేలేదని వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి అని అంబటి రాంబాబు తాను చేసిన పోస్టులో స్పష్టం చేశారు.

English summary
In the YSR Congress party, the Ambati illegal mining affair in the Sattenapalli constituency is now causing an interesting debate. Reveals internal strife in YCP. YCP Activists pill laying on an MLA irregularities has become a hot topic in the AP. Ambati Rambabu also responded to this. Counter-attack on those who went to the high court on him .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X