గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నూతన్ నాయుడును అరెస్ట్ చేయరా?: ఆనంద్ బాబు, బాధితుడికి మంత్రి పరామర్శి, సాయం

|
Google Oneindia TeluguNews

గుంటూరు: దళితులపై దాడులతో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. బడుగులను హింసిస్తూ వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. దళితులపైదాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు చేస్తోందని చెప్పారు.

నూతన్ నాయుడును ఎందుకు అరెస్ట్ చేయరా?

నూతన్ నాయుడును ఎందుకు అరెస్ట్ చేయరా?

దళితులపై వరుస ఘటనలకు నిరసనగా.. గుంటూరులో దీక్షకు దిగారు. విశాఖ దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నక్కా ఆనంద్ బాబు నిలదీశారు. నూతన్ నాయుడు వైసీపీ సిద్ధాంత కర్త కాబట్టే చర్యలు తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు.

ఇంత దుర్మార్గంగానా?

ఇంత దుర్మార్గంగానా?


వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన దళితులపైనే కక్షకట్టడం దారుణమని అన్నారు. దళితుల ఓట్లతో గెలిచి వారిపైనే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీల పట్ల పాలకపక్షం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. దళితులపై దాడుల వివరాలతో ముద్రించిన పుస్తకాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కాగా, చంద్రబాబు కూడా బాధితుడితో ఫోన్లో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Recommended Video

PM Modi Gives Call To Be “Vocal For Local Toys” || Oneindia Telugu
బాధితుడిని పరామర్శించిన మంత్రి అవంతి, సాయం

బాధితుడిని పరామర్శించిన మంత్రి అవంతి, సాయం

ఇది ఇలావుండగా, శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు ఆదివారం పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీఇచ్చారు. దళితులపై దాడులను ప్రభుత్వం సహించదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఘటన జరిగిన తీరుతోపాటు కుటుంబ ఆర్థిక పరిస్థిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున శ్రీకాంత్‌కు లక్ష రూపాయలను నగదు, సొంత ఇల్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఉన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా తన సొంత నగదు రూ. 50వేలను శ్రీకాంత్‌కు
అందజేశారు. ఈ ఘటనలో ఇప్పటికే నూతన్ నాయుడి భార్య సహా నిందితులు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి అవంతి తెలిపారు.

English summary
nakka anand babu on visakha shiromundanam issue, minister avanthi meets dalith youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X