గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను చెయ్యని నేరానికి శిక్షా .. కావాలనే వేధింపులు .. నన్నపునేని రాజకుమారి ఆవేదన

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSRCP Dharna On Nannapaneni Rajakumari Comments || నన్నపనేని రాజకుమారి పై మండిపడుతున్న దళిత సంఘాలు

దళిత మహిళా ఎస్సైను కులం పేరిట దూషించారంటూ తనపై వస్తున్న ఆరోపణలను గురించి నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు . అసలు తను మహిళా ఎస్సై ను ఏమీ అనలేదని, కక్షపూరితంగా తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

టీడీపీని రక్షించే వాడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే .. మరోమారు తెరపైకి యువనాయకుడి అంశంటీడీపీని రక్షించే వాడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే .. మరోమారు తెరపైకి యువనాయకుడి అంశం

ఇంత దారుణమైన అపవాదు రాజకీయ జీవితంలో తొలిసారి అన్న నన్నపునేని

ఇంత దారుణమైన అపవాదు రాజకీయ జీవితంలో తొలిసారి అన్న నన్నపునేని

జీవితంలో ఎప్పుడూ ఇంత మనోవేదన అనుభవించ లేదని చెప్పిన నన్నపనేని రాజకుమారి ఇప్పటివరకు తనపై ఎవరు ఇంత దారుణమైన అపవాదు వెయ్యలేదని పేర్కొన్నారు.

50 ఏళ్ల సంఘ సేవా జీవితంలో, అలాగే తన 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అపవాదులు ఎదుర్కోలేని ఆవేదన వ్యక్తం చేశారు. తానేమిటో, తన జీవితం ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలుసన్న నన్నపనేని రాజకుమారి తనను వేధింపులకు గురి చేసి ఇంకా 18 మాసాలు తన పదవీకాలం ఉండగానే తనతో బలవంతంగా రాజీనామా చేయించారని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెయ్యని నేరానికి శిక్ష వేయాలని వైసిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారని వాపోయిన టీడీపీ మహిళా నేత

చెయ్యని నేరానికి శిక్ష వేయాలని వైసిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారని వాపోయిన టీడీపీ మహిళా నేత

ఇక తనను శిక్షించాలని వైసిపి నాయకులు చేస్తున్న ప్రయత్నాలపై మాట్లాడిన నన్నపనేని చెయ్యని నేరానికి శిక్ష వేయాలని వైసిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

చంద్రబాబు నివాసం వద్ద చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమైన టిడిపి నేతలను అరెస్టు చేసి తీసుకు వెళ్ళే క్రమంలో తాము ఉన్న వాహనంలో ఏసీ లేదా అని తన వెనుక ఉన్న టీడీపీ నాయకురాలు అనిత, సత్యవాణి ప్రశ్నించారని చెప్పిన నన్నపనేని రాజకుమారి, అచ్చెన్నాయుడు ఉన్న వాహనంలో ఏసీ ఉంది అని మగవాళ్లకేమో ఏసీ జీపు, ఆడవాళ్లకేమో ఏసీ లేని జీపు ఇచ్చారులే అని మాట్లాడుకున్నామని చెప్పారు.

ఏసీ లేదు, జీపు దరిద్రంగా ఉందేంటీ అంటే మహిళా ఎస్సైని దూషించినట్టు వక్రీకరణలు

ఏసీ లేదు, జీపు దరిద్రంగా ఉందేంటీ అంటే మహిళా ఎస్సైని దూషించినట్టు వక్రీకరణలు


ఏసీ లేదు, ఇంత దరిద్రంగా ఉందేంటీ జీపు అని అనుకున్న విషయాన్ని వక్రీకరించి, అసలు మేము మాట్లాడుకున్న సందర్భాన్ని మొత్తం వినని మహిళా ఎస్సై తమపై గట్టిగా అరిచారు అని, ఎందుకు అలా అరుస్తున్నావ్ అని ప్రశ్నించినందుకు అతని వంక ఎస్సై వేలు చూపించి వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు.
అసలు తాను కులం పేరుతో మహిళా ఎస్సై ని దూషించలేదు అని లబోదిబోమంటున్నారు నన్నపనేని రాజకుమారి.

వైసీపీ ప్రోద్బలంతోనే తనపై కేసులని నన్నపునేని ఆరోపణ

వైసీపీ ప్రోద్బలంతోనే తనపై కేసులని నన్నపునేని ఆరోపణ

కేసుపెట్టే వాళ్లకు, ప్రోత్సహించి కేసు పెట్టమని బలవంతం చేసే వాళ్లకు కొంచెమైనా బుర్ర ఉండాలిగా అని వైసీపీ నాయకులు మహిళా ఎస్సైతో కేసు పెట్టిస్తున్నారని మండిపడుతూనే ఇదంతా కుట్ర అన్నారు . రాజకీయాల్లో ఒకరికొకరం ప్రత్యర్ధులుగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఉద్యోగస్తులను ఇన్వాల్వ్ చేయకూడదని నన్నపనేని వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యవహారంలో అటు సదరు మహిళా ఎస్సై, దళిత సంఘాలు, వైసిపి చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో నన్నపునేని ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోనున్నారో ...

English summary
Nannapuneni Rajakumari has expressed concern over the allegations leveled against her by accusing the dalit women in the name of caste. Former chairperson of the AP Women's Commission, Nannapaneni, has vehemently denied the allegations leveled against her. She claimed that she did not mean the female SI and that she was making such allegations against her because of YCP .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X