గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఓ స్కామ్ స్టార్ .. వాలంటీర్ల నియామకం ఓ కుంభకోణం అన్న లోకేష్

|
Google Oneindia TeluguNews

నారా లోకేష్ మరోమారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు . మొన్నటికి మొన్న మాది నిరు పేద రాష్ట్రం అని చెప్పుకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి అంటూ జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్ సొంత డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా గ్రామ వాలంటీర్ల నియామకం ఓ కుంభకోణం అని షాకింగ్ ట్వీట్ చేశారు. వైసీపీ చేసే ప్రతి పని, తీసుకునే ప్రతీ నిర్ణయంపై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఏపీలో చర్చకు కారణం అవుతున్నాయి.

జగన్ ను బీజేపీ వదిలిపెట్టదా ..? సుజనా చౌదరి వ్యాఖ్యల ఉద్దేశం అదేనా ? <br>జగన్ ను బీజేపీ వదిలిపెట్టదా ..? సుజనా చౌదరి వ్యాఖ్యల ఉద్దేశం అదేనా ?

వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల నియామకం పేరుతో రూ.12 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఇక పార్టీ కార్యకర్తలను పోషించే ప్లాన్ లో భాగంగా గ్రామ వాలంటీర్ లను నియమిస్తున్నారే తప్ప మరోటి కాదని ఆయన పేర్కొన్నారు. 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి 10 లక్షల మంది ఉద్యోగులను తీసేసి వారి కడుపు మీద కొట్టే కుట్ర జగన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు అంటే ఊహించనంత పెద్ద ఫ్రాడ్ అన్నారు. జగన్ సర్కార్ చేస్తుంది వాలంటీర్ల కుంభకోణం అని లోకేశ్ విమర్శించారు. వాలంటీర్ల నియామకంలో కులాలు, మతాలు చూడడంలేదని, సదరు అభ్యర్థి వైసీపీ కార్యకర్తా? కాదా? అని మాత్రమే చూస్తామని వైసీపీ నేతలు స్వయంగా ప్రకటిస్తున్నారంటూ మండిపడ్డారు. తద్వారా జగన్ గారు ఓ స్కామ్ స్టార్ అని ఆధారాలతో నిరూపితమైందని మండిపడ్డారు.

Nara Lokesh alleged village volunteer jobs are nothing but scam

రాజకీయాలకు అతీతంగా గ్రామవాలంటీర్ల నియామకం ఉంటుందని జగన్ గారు ఆస్కార్ అవార్డుల స్థాయిలో నటిస్తున్నారని కానీ , అసలు నిజాన్ని కడుపులో దాచుకోలేక దొంగ లెక్కల వీరుడు కుంభకోణాన్ని బయటికి కక్కేశారంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ మేరకు విజయసాయిరెడ్డి ఓ సమావేశంలో మాట్లాడుతున్న వీడియోను కూడా లోకేశ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. కేవలం వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమే ఇదంతా చేస్తున్నారని లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎండగట్టే ప్రయత్నం చేశారు.

English summary
TDP National General Secretary Nara Lokesh has alleged that the YCP government has opened up Rs 12,000 crore scam of public money in the name of hiring volunteers. He added that the village volunteers are part of the plan to nurture the party workers. Around 4 lakh YCP workers have been accused of conspiring to get 10 lakh employees to get jobs. He said the largest number of volunteer jobs is the unexpected fraud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X