‘జగన్ గారి ఇసుకాసుర లీలలు చూడండి.. తెలుగుకు తెగులు పట్టించారిలా..!’
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్, బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ ఘాటు విమర్శలు చేయగా.. జగన్మోహన్ రెడ్డితోపాటు విజయసాయి రెడ్డిపైనా మండిపడ్డారు బుద్ధా వెంకన్న.
పోటాపోటీ దీక్షలు: చంద్రబాబుకు పార్థసారథి వార్నింగ్, తాబేదారు అంటూ పవన్ కళ్యాణ్‌పై..
వైసీపీ అసమర్థ నిర్ణయాల వల్లే..
‘గుంటూరుజిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పర్యటించాను.వైకాపా ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల కారణంగా, ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు అడపా రవి కుటుంబాన్ని పరామర్శించాను. తెలుగుదేశంపార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చి, పార్టీ తరపున ఆర్థిక సహాయం అందించాను' అని నారా లోకేష్ తెలిపారు.
జగన్ గారి ఇసుకాసుర లీలలు ..
‘వైఎస్ జగన్ గారి ఇసుకాసుర లీలలు బయటపడ్డాయి. వైకాపా ఇసుక దొంగలు అడ్డంగా దొరికారు. 5 నెలల్లో 42 మంది భవన నిర్మాణ కార్మికులని మింగేసిన పాపం వీరిని ఊరికే వదలదు' అంటూ నారా లోకేష్ విమర్శించారు.

కార్మికుల నోటికాడి కూడు లాక్కొని..
‘భవన నిర్మాణ కార్మికుల నోటి దగ్గర కూడు లాక్కొని వైకాపా నేతలు అవినీతి కోటలు నిర్మిస్తున్నారు. వరద వలనే ఇసుక దొరకడం లేదు అని చిలక పలుకులు పలుకుతున్న జగన్ గారు భవన నిర్మాణ కార్మికులకు క్షమాపణలు చెప్పాలి' అని లోకేష్ డిమాండ్ చేశారు.

జే టాక్స్ వసూలయ్యేవరకూ..
‘సిమెంట్ కంపెనీల నుండి జే ట్యాక్స్ వసూలు అయ్యే వరకూ వరద కారణంగా ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతూనే ఉంటుంది. వైకాపా ఇసుక మాఫియా లిస్ట్ ర్యాంపుల దగ్గర క్యూ కట్టిన ట్రాక్టర్లలా పెరుగుతూనే ఉంది' అని లోకేష్ ఆరోపించారు.
దొంగ దీక్షలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్..
‘దొంగ దీక్షలకు పేటెంట్ రైట్స్ వైకాపా పార్టీకే ఉన్నాయి. దొంగ దీక్షల బెస్ట్ డైరెక్టర్‌గా మీకు అవార్డు కూడా వచ్చింది కదా విజయసాయి రెడ్డి గారు. పెద్ద రోగంతో పోయిన వాడు మా నాన్న కోసమే పోయాడు అంటూ బుగ్గలు నిమరడం, బిల్డ్ అప్ సాంగ్స్, గ్రాఫిక్స్‌లో జనం, ఏసీ బస్సులో మేత అంతా బహిరంగ రహస్యమే కదా సాయి రెడ్డి గారు. మీ చరిత్రలో మీ సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజల కోసం చేసిన ఒక్క దీక్ష పేరు అయినా చెప్పగలరా? భవన నిర్మాణ కార్మికుల కష్టాలు,ఆత్మహత్యల పై జోకులు వేస్తున్నారు సిగ్గుగా లేదా విజయ్ గారు?..' అంటూ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. జగన్ తెలుగు ప్రసంగంలో తప్పులు దొర్లడంపైనా ఆయన విమర్శలు చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!