• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ కు లోకేష్ ట్వీట్ కాల్- వాళ్లూ వీళ్లూ ఎందుకు నువ్వే వచ్చిపో-సరదా తీర్చేస్తామంటూ...

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న వార్ ఇవాళ మరో మలుపు తిరిగింది. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తూ ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భంగపడి ఆయన వెనుదిరిగిన తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సీఎం జగన్ పై ట్వీట్ వార్ మొదలుపెట్టారు. ఇందులో ఆయన వాళ్లూ వీళ్లూ ఎందుకు మీరే రండంటూ జగన్ కు ఆహ్వానం పలికారు.

Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)Aditi Budhathoki: నేపాలీ బ్యూటీ 'అదితి బుధతోకి'.. హాట్ బికినీ అందాలకు ఫిదా అవ్వాల్సిందే! (ఫోటోలు)

జోగి రమేష్ ఘటనపై లోకేష్ రియాక్షన్

జోగి రమేష్ ఘటనపై లోకేష్ రియాక్షన్

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఇంటి ముట్టడి పేరిట ఉండవల్లి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆ తర్వాత టీడీపీ అడ్డుకోవడంతో వెనుదిరిగారు. అయితే జోగి రమేష్ చేసిన హంగామాపై ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ఆయనతో పాటు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు. దీంతో లోకేష్ చేసిన ట్వీట్లు ఇప్పుడు ఇరు పార్టీల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

జగన్ వణికి ఛస్తున్నారన్న లోకేష్

జగన్ వణికి ఛస్తున్నారన్న లోకేష్

ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను పంపిన ఘటనపై స్పందించిన నారా లోకేష్... ప్రతిపక్ష నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యే, బులుగు గూండాలను (వైసీపీ) పంపావంటేనే తాడేపల్లి కొంపలో ఎంతగా వణికి ఛస్తున్నావో అర్ధమవుతోందంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఇంతకంటే నువ్వు దిగజారవని అనుకున్న ప్రతిసారీ అధఃపాతాళంలోకి దిగజారుతూనే ఉన్నావంటూ సీఎం జగన్ పై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలోనూ లోకేష్ పలుమార్లు జగన్ దిగజారారంటూ విమర్శలు చేశారు.

తాడేపల్లికి ఉండవల్లీ అంతే దూరం

ఉండవల్లికి తాడేపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యేను పంపారనే అర్ధం వచ్చేలా మరో ట్వీట్లో నారా లోకేష్ సీఎం జగన్ పై విమర్సలు చేశారు. నీ తాడేపల్లి ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇల్లు నుంచి నీ ఇల్లూ అంతే దూరం. ఆ రోజు కూడా ఎంతో దూరం లేకుండా నువ్వే తెచ్చుకుంటున్నావు. నీ గాలి హామీలు తేలిపోయాయి. నీ ముద్దులు పిడిగుద్దుల్లా పడుతున్నాయి. జగన్ ది నాటకమని జనానికి తెలిసిపోయిందంటూ ట్వీట్లో లోకేష్ తీవ్ర విమర్శలకు దిగారు.

నువ్వే ఓసారి వచ్చిపోరాదూ...

మరో ట్వీట్లో సీఎం జగన్ ను తమ ఉండవల్లి నివాసానికి రావాలని నారా లోకేష్ సవాల్ విసిరారు. జనం తిరగబడే రోజు దగ్గరపడిందని ఉలిక్కిపడిప్రతిపక్షంపైకి వాళ్లనీ, వీళ్లనీ పంపడం ఎందుకు ? నువ్వే ఓసారి వచ్చిపోకూడదూ.. మా పెద్దాయన (చంద్రబాబు) నీలాంటి క్రూర, నేర స్వభావం ఉన్నోడు కాదు. నువ్వు ముంచేయాలని నిత్యం తపించే కరకట్ట పక్క ఇంట్లో టీ,స్నాక్స్ పెట్టి అంటూ లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.

జగన్ సరదా తీర్చేస్తామన్న లోకేష్

సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన మరో ట్వీట్లో నారా లోకేష్.... బొత్తిగా నీకు తెలియని అభివృద్ధి అంటే ఏంటి ? కొత్తగా పరిశ్రమలు ఎలా తీసుకురావాలి ? ఉపాధి-అవకాశాలు ఎలా పెంపొందించుకోవాలి ? అనే అంశాలు చక్కగా వివరిస్తారు . కాదూ కూడదు అంటే ఇలాగే బ్లేడ్ బ్యాచ్ లను వేసుకొచ్చేస్తానంటే , నీ సరదాని మేమెందుకు కాదంటాం ? ఒక్కొక్కళ్లకీ వడ్డీతో సహా చెల్లిస్తామంటూ నారా లోకేష్ సెటైర్లు వేశారు.

English summary
tdp mla nara lokesh on today ask andhrapradesh cm ys jagan to visit chandrababu house in undavalli instead of sending ysrcp mlas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X