గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు అప్పులు రూ.5.13 కోట్లు, తగ్గిన భువనేశ్వరి అసెట్స్, శ్రీమతికి గిప్ట్‌గా షేర్లు: లోకేశ్

|
Google Oneindia TeluguNews

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన, కుటుంబ ఆస్తులను గురువారం ప్రకటించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కుటుంబసభ్యుల ఆస్తులను కలిపి వెల్లడించారు. కుటుంబానికి ఆర్థిక స్వాతంత్ర్యం కోసమే హెరిటేజ్ ఏర్పాటు చేశామని వివరించారు. గత 23 ఏళ్లుగా తన తల్లి నారా భువనేశ్వరి పనిచేస్తున్నారని తెలిపారు. హెరిటేజ్ కంపెనీ ద్వారా 3 వేల మందికి ఉపాధి కలుగుతోందని చెప్పారు.

రూ.119.42 కోట్లు..

రూ.119.42 కోట్లు..

తమ కుటుంబ మొత్తం ఆస్తులు రూ.119.42 కోట్లు అని లోకేశ్ తెలియజేశారు. అప్పులు రూ.26.04 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. అప్పులను మినహాయిస్తే ఆస్తుల విలువ 93.38 కోట్లు అని చెప్పారు. గతేడాదితో పోలిస్తే మొత్తం ఆస్తులు విలువ రూ.85 లక్షలు పెరిగాయన్నారు. తన తండ్రి చంద్రబాబు ఆస్తి రూ.3.87 కోట్లు అని లోకేశ్ ప్రకటించారు. అందులో రూ.5.13 కోట్ల అప్పులు ఉందనే విషయం తెలియజేశారు.

భువనేశ్వరి రూ.50 కోట్లు

భువనేశ్వరి రూ.50 కోట్లు

తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని స్పష్టంచేశారు. తన ఆస్తి రూ.24 కోట్లు కాగా.. బ్రహ్మణి ఆస్తి రూ.15 కోట్ల 68 లక్షలు అని వివరించారు. తన పేరుతో ఉన్న షేర్లు బ్రహ్మణికి బహుమతిగా ఇచ్చానని తెలిపారు. దేవాన్స్ ఆస్తి 19 కోట్ల 42 లక్షలు అని తెలియజేశారు. ప్రతీ ఏటా తమ ఆస్తులను ప్రకటిస్తున్నామని తెలిపారు.

ఆస్తులు ప్రకటించండి..

ఆస్తులు ప్రకటించండి..


దమ్ముంటే విమర్శించే నేతలు ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో యువత రావాలనే ఉద్దేశంతో తాను ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేశానని తెలిపారు. బినామీ భూముల, ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ విపక్ష నేతల ఆరోపణలపై లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆరోపణలపై విచారణ ఎందుకు జరపడం లేదు అని లోకేశ్ ప్రశ్నించారు. ఆ ఆరోపణలను నిరూపించలేరు అందుకే విచారణ వేసే ధైర్యం లేదన్నారు.

తప్పు చేయలే..?

తప్పు చేయలే..?


క్రమశిక్షణతో వ్యాపారం చేస్తున్నామని, పట్టుదలతో రాజకీయాల్లో ఉన్నామని.. ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు. వైసీపీకి మాత్రం తమను విమర్శించడమే పని అని దుయ్యబట్టారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులకు రూ.2.68 లక్షలు దొరికాయి.. మళ్లీ వాటిని ఆయనకే తిరిగిచ్చేశారు అని తెలిపారు. మేం ఏ రోజు తప్పు చేయలేదని.. అందుకే నిర్భయంగా ఉంటామని లోకేశ్ పేర్కొన్నారు.

English summary
nara lokesh declare his family assets. total assets value is 119.42 crores
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X