గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంధకారప్రదేశ్‌గా నవ్యాంధ్ర.. 100 రోజుల్లో 40 ఏళ్ల వెనక్కి రాష్ట్రం... జగన్‌పై లోకేశ్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఫైరయ్యారు. జగన్ సర్కార్ పాలన అంత రివర్స్ అని దుయ్యబట్టారు. రివర్స్ పాలనలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయని లోకేశ్ విమర్శించారు. 100 రోజుల్లోనే రాష్ట్ర అభిృద్ధి 40 ఏళ్ల కాలానికి వెళ్లిపోయిందని లోకేశ్ దుయ్యబట్టారు. ప్రజలు మళ్లీ లాంతర్, కొవ్వొత్తుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

రాష్ట్రంలో కరెంట్ కష్టాలతో కొవ్వొత్తులు, విసనకర్రల కాలానికి తీసుకెళ్లారని లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను టీడీపీ సర్కార్ నవ్యాంధ్రగా మారిందని గుర్తుచేశారు. కానీ జగన్ మాత్రం అంధకారప్రదేశ్‌గా మారుస్తున్నారని మండిపడ్డారు. ఆయన పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వైఖరిపై జనం ఆగ్రహంతో ఉన్నారని గుర్తుచేశారు. జనం బాగోగులను సీఎం జగన్ గాలికొదిలేశారని తీవ్రస్థాయిలో లోకేశ్ విరుచుకుపడ్డారు.

nara lokesh fire on ap cm jagan

కావాలి ఇసుక, రావాలి కరెంట్ అంటూ జనాలు వేడుకుంటున్నారని లోకేశ్ పేర్కొన్నారు. కానీ జనాల మనోగతాన్ని జగన్ అర్థం చేసుకోలేకపోయారని విమర్శించారు. 100 రోజుల్లో జగన్ చేసిందేంటీ అని ప్రశ్నించారు. ఇస్తోన్న రుణమాఫీని రద్దు చేయడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలకు కోత పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రతీ దానికి గత ప్రభుత్వం చేసిందేంటి అని ముడిపెట్టడం సబబు కాదన్నారు. గత ప్రభుత్వాల తప్పిదాలను తమపై రుద్దడం సరికాదని లోకేశ్ అన్నారు. గత ఐదేళ్లలో నవ్యాంధ్ర అభివృద్ధి దిశగా పరుగెత్తిందని తెలిపారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అందుకు విరుద్ధ పరిస్థితి ఉందని మండిపడ్డారు.

English summary
tdp leader nara lokesh fire on ap cm jagan. ap development is backward. jagan govt does to do anything lokesh alleges
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X