• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మృగాల 500వ దాడి ... జగన్100 రోజుల పాలనకు అంకింతం చేశారన్న లోకేష్

|

జగన్ ప్రభుత్వ పాలనలో 100 రోజుల కాలంలో ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని టీడీపీ మండిపడుతుంది . ఏపీలోని గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసిన తర్వాత 100 రోజులు గడిచినా ఆగటం లేదు . టీడీపీ కార్యకర్తలపై దాడులపై టీడీపీ మండిపడుతున్నా అధికార పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక టీడీపీ జగన్ వంద రోజుల పాలనపై వైసీపీ మృగాల దాడులు అంటూ మాటల తూటాలు పేల్చారు నారా లోకేష్ .

చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం .. భవిష్యత్ అద్భుతాలకు సంకేతం చంద్రయాన్ 2

జగన్ పాలన 100 రోజులైనా టీడీపీ కార్యకర్తలపై దాడులు ఆగలేదన్న నారా లోకేష్

జగన్ పాలన 100 రోజులైనా టీడీపీ కార్యకర్తలపై దాడులు ఆగలేదన్న నారా లోకేష్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత రెండు వారాలుగా పార్టీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా వైసీపీ బాధితుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం కొనసాగుతుండగానే అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడి చేశారంటూ టీడీపీ మండిపడుతుంది . పుట్టపర్తి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల తలలు పగలగొట్టారంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు . వైఎస్సార్‌సీపీ, జగన్ టార్గెట్‌గా ఘాటుగా ట్వీట్లు చేసిన లోకేష్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

మీ తుగ్లక్ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం టీడీపీ నేతలపై దాడులతో రక్తమోడుతోందన్న లోకేష్

మీ తుగ్లక్ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం టీడీపీ నేతలపై దాడులతో రక్తమోడుతోందన్న లోకేష్

ఇక ఆయన చేసిన ట్వీట్లు చూస్తే పుట్టపర్తి నియోజకవర్గం మైలసముద్రం గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలపై రాళ్లతో దాడిచేశారు. ఆడవాళ్లు, వృద్ధులు అనే కనికరం కూడా లేకుండా తీవ్రంగా గాయపరిచారు. జగన్ గారూ.. మీ పాలన 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంలో 500వ దాడిని మీకు అంకితం చేశారు మీ వైకాపా మృగాలు! అంటూ వైసీపీ నేతలను, కార్యకర్తలను టీడీపీ నేతలపై, కార్యకర్తలపై దాడులు చేసిన మృగాలుగా వ్యాఖ్యానించారు. ఇక మరో ట్వీట్ లో రాష్ట్రం టీడీపీ నేతల రక్తంతో నెత్తురోడుతుంది అని ఆరోపిస్తున్నారు నారా లోకేష్ .గత ఐదేళ్లుగా పచ్చని తివాచీ పరుచుకున్న ఆంధ్ర రాష్ట్రం, నేడు మీ తుగ్లక్ పరిపాలనలో రక్తమోడుతోంది. వైకాపా రాక్షసులకు తెదేపా కార్యకర్తల రక్తం కళ్లచూడందే నిద్ర పట్టడంలేదనుకుంటా. ఇకనైనా ఈ మారణహోమం ఆపండి. లేదంటే కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజలమీద పడి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు వైసీపీ నేతలు అని లోకేష్ మండిపాటు

అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజలమీద పడి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు వైసీపీ నేతలు అని లోకేష్ మండిపాటు

ఇక అంతేకాదు "జగన్ గారు.. మీ కార్యకర్తలు, నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా ప్రజలమీద పడి రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మీరేమో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ శాంతిభద్రతలను గాలికొదిలేశారు. ప్రజలకు అండగా ఉండవలసిన పోలీసు యంత్రాంగం మౌనం వహించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులను ఫోటోలుగా పోస్ట్ చేసిన లోకేష్ "వైకాపా నీచ రాజకీయ కక్షలకు బలైన తెదేపా సానుభూతిపరుల కుటుంబాల పునరావాస శిబిరాన్ని సందర్శించాను. ఒక్కొక్కరి బాధ వింటుంటే గుండె తరుక్కుపోతోంది. ఇకపై ఇటువంటి దాడులకు భయపడేది లేదని, గట్టిగా సమాధానం ఇద్దామని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చాను" అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
During the 100-day rule of the Jagan government, the situation in the AP is worse than the TDP. There is no real reason for the uproar.. The clashes that began in the wake of the election did not stop 100 days after the election. There are allegations that the ruling party is infuriated by the TDP's agitation against attacks on TDP activists. on the 100-day rule of the YCP Nara Lokesh fired on jagan and ycp leaders about the attacks on tdp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more