గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు పేరు లేకుండా చేసేందుకేనా? అడుగు కూడా ముందుకు వేయలేరు: నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం రాజధాని అంశంపై జగన్ ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు.

అందుకేనా రాజధాని ధ్వంసం?


స్థానిక యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న‌, సెల్ఫ్ ఫైనాన్స్ కేపిట‌ల్‌, గార్డెన్ సిటీ, లంగ్‌స్పేస్‌తో ప్రపంచానికే తలమానిక రాజధాని నిర్మిస్తానని చెప్పి.. గొప్ప లక్ష్యంతో కట్టిన రాజధానిని ఎందుకు ధ్వంసం చేస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డిని లోకేష్ నిలదీశారు. మీరు అనుకున్న దానికంటే గొప్పగా కట్టారనే కూలగొడుతున్నారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు పేరు లేకుండా చేసేందుకేనా?

చంద్రబాబు పేరు లేకుండా చేసేందుకేనా?

‘నువ్వేమైతే చెప్పావో వాటికంటే ఘ‌న‌మైన ల‌క్ష్యాల‌తో చంద్ర‌బాబు నిర్మించిన అమ‌రావ‌తి ప్ర‌జారాజ‌ధానిని ఎందుకు ధ్వంసం చేయాల‌నుకుంటున్నారో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. మీరు క‌ట్టాల‌నుకున్న‌ రాజ‌ధాని కంటే గొప్ప‌ది చంద్రబాబు క‌ట్టారని కూల‌గొడుతున్నారా? అని నారా లోకేష్ ప్రశ్నించారు. అమరావతి నిర్మాతగా చంద్రబాబు పేరు చరిత్రలో ఉండకూడదనే మూడు ముక్కలాటతో విధ్వంసం సృష్టిస్తున్నారా? అని లోకేష్ ప్రశ్నించారు. ఐదు కోట్ల ఆంధ్రులకు దీనిపై మీరు సమాధానం చెప్పి తీరాలి అంటూ లోకేష్ డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్.. మీ వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు..

వైఎస్ జగన్.. మీ వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు..

‘ఎన్నికల ముందు 3 రాజధానుల గురించి చెప్పకుండా... అధికారంలోకి వచ్చాక మీ స్వార్థం కోసం రహస్య ఎజెండాను అమలుచేస్తామంటే అది కుదరదు. రాష్ట్ర రాజధాని నిర్ణయం 5 కోట్ల ఆంధ్రులు చేయాలి. మీ వ్యక్తిగత నిర్ణయాలు పనికిరావు' అంటూ ఘాటుగా విమర్శించారు.

Recommended Video

Amaravati ఉద్యమానికి 200 రోజులు, Capital Issue Remains Unresolved || Oneindia Telugu
అక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.. జగన్‌కు లోకేష్ సవాల్

అక్క అడుగు కూడా ముందుకు వేయలేరు.. జగన్‌కు లోకేష్ సవాల్


అందుకే 3 రాజధానుల ఎజెండాతో ఎన్నికలకు వెళదామన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. 48 గంటల సమయం ఇచ్చినా సవాలును స్వీకరించలేకపోయిన పులివెందుల పిల్లులకు... చంద్రబాబు మరో మార్గం చెప్పారు. మూడు రాజధానుల పై ప్రజల రెఫరెండం తీసుకోండి. ఇది కూడా చేయం.. మాకు అంత ధైర్యం లేదు... మా ఇష్టానుసారం పోతాం అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుంటే తెలుగుదేశం రాజీపడే ప్రసక్తే లేదంటూ లోకేష్ తేల్చి చెప్పారు.

English summary
nara lokesh hits out at ys jagan on three capital cities issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X