• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మోడీని చూసి ప్యాంటు తడుపుకునే బ్యాచ్ అవసరమా ? వైసీపీకి ఇంకో గొర్రెను గెలిపిస్తారా : లోకేష్ ధ్వజం

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల పోరులో ప్రచార పర్వం వాడీవేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు.

జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో .. రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీనే : నారా లోకేష్జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో .. రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీనే : నారా లోకేష్

అటువైపు ఆలీబాబా దొంగలు .. ఇటు ప్రజల కోసం పోరాడే పనబాక లక్ష్మి

అటువైపు ఆలీబాబా దొంగలు .. ఇటు ప్రజల కోసం పోరాడే పనబాక లక్ష్మి


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో 21 మంది ఎంపీలు, రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉండి ఏం చేశారని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ పాలన పై ధ్వజమెత్తిన లోకేష్ విశాఖ ఉక్కు సాధించారా.. హోదా తెచ్చారా .. అంటూ నిలదీశారు. అటువైపు ఆలీబాబా దొంగలు నిలబడ్డారు ఇటు ప్రజల కోసం పోరాడే పనబాక లక్ష్మి ఉన్నారు. ఈ ధర్మ పోరాటంలో సైకిల్ కి ఓటేసి తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని లోకేష్ పిలుపునిచ్చారు.

 జగన్ ప్రభుత్వాన్ని జెసిబి ప్రభుత్వంగా అభివర్ణించిన లోకేష్

జగన్ ప్రభుత్వాన్ని జెసిబి ప్రభుత్వంగా అభివర్ణించిన లోకేష్


చిత్తూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లోకేష్ వరదయ్యపాలెంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రభుత్వాన్ని జెసిబి ప్రభుత్వం గా అభివర్ణించారు . జె అంటే జగన్ టాక్స్, సి అంటే కరెక్షన్ , బి అంటే బాదుడు అంటూ జగన్ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రభుత్వ పథకాల పేరుతో ఒక చేత్తో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.100 లాక్కుంటున్నారు అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు గొర్రెల మంద గా వ్యవహరిస్తున్నారన్న లోకేష్, పార్లమెంటుకు ఇంకో గొర్రెను పంపించటం అవసరమా అంటూ ప్రశ్నించారు.

టీడీపీ ముగ్గురు ఎంపీలు సింహాల్లా పోరాటం చేస్తున్నారు

టీడీపీ ముగ్గురు ఎంపీలు సింహాల్లా పోరాటం చేస్తున్నారు

తిరుపతి అభివృద్ధికి వైసీపీ పాలనలో చేసింది ఏంటి అని ప్రశ్నించారు లోకేష్. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ , విమానాశ్రయ విస్తరణ, స్మార్ట్ సిటీ గురించి ఏనాడైనా మాట్లాడారా? ఒక్క రూపాయి తెచ్చారా అంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో ముగ్గురు ఎంపీలు ఉన్న సింహాల్లా గర్జిస్తున్నారని, సమస్యలపై పోరాడుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ,పోలవరం, విశాఖ రైల్వేజోన్ తదితర అంశాలపై కేంద్రం నిలదీసేది తెలుగుదేశం పార్టీ ఎంపీలేనని నారా లోకేష్ పేర్కొన్నారు.

కేంద్రం ఏం చెబితే ఆ మేరకు తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే ఏం లాభం

కేంద్రం ఏం చెబితే ఆ మేరకు తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే ఏం లాభం

పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు కావాలని, మోడీని చూసి ప్యాంటు తడుపుకునే బ్యాచ్ అవసరమా అంటూ ప్రశ్నించిన లోకేష్ , కేంద్రం ఏం చెబితే ఆ మేరకు తలాడించే గొర్రెల మందలో ఇంకో గొర్రె చేరితే లాభం ఏమైనా ఉంటుందా అని అడిగారు.

అవినీతి రాజకీయాలతో దోపిడీ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి ని గద్దె దించడం కోసం ఉప ఎన్నిక తీర్పు ద్వారా నాంది పలకాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టే వైసీపీ ఎంపీలు కావాలో .. ప్రగతి కోసం పాటుపడే పనబాక లక్ష్మి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని నారా లోకేష్ అన్నారు.

పార్లమెంట్లో పడుకుని జగన్ రెడ్డి పాద సేవ చేసే ఎంపీ కావాలో.. మీ ఇంటి లక్ష్మి కావాలో తేల్చుకోండి

పార్లమెంట్లో పడుకుని జగన్ రెడ్డి పాద సేవ చేసే ఎంపీ కావాలో.. మీ ఇంటి లక్ష్మి కావాలో తేల్చుకోండి

ఒక మహిళగా ఇంట్లో ఆడవాళ్లు పడే కష్టాన్ని చూసిన పనబాక లక్ష్మి, ఎంపీగా ప్రజల సమస్యల పరిష్కారానికి కూడా కీలకంగా పనిచేసిన మహిళ కాబట్టి పార్లమెంటులో మీకు సేవ చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలకు సేవ చేసే మీ ఇంటి లక్ష్మీ కావాలో .. పార్లమెంట్లో పడుకుని జగన్ రెడ్డి పాద సేవ చేసే ఎంపీ కావాలో మీరే తేల్చుకోండి అంటూ లోకేష్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ని టార్గెట్ చేశారు.

English summary
TDP General Secretary Nara Lokesh launched a blistering attack on the ruling YSRCP and gave a call to the voters of Tirupati parliament segment not to send ‘useless persons’ to the Parliament but vote for the TDP candidate who would fight for their cause. He termed the byelection as a battle between the Jagan Reddy Alibaba robbers and the TDP fighters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X