• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దయనీయ స్థితిలో ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్లను ఆదుకోండి .. సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

|

కరోనా మహమ్మారి విసిరిన పంజా దెబ్బకు ప్రైవేట్ స్కూల్స్ మూతపడగా, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్లు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పే టీచర్లు స్కూళ్లు, కళాశాలలు మూత పడటంతో యాజమాన్యాలు టీచర్లకు జీతాలు ఇవ్వని కారణంగా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ పరిస్థితులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులను వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  The TDP ranks anointed Nara Lokesh as a great leader | Oneindia Telugu
   ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న దంపతుల ఆత్మహత్య

  ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ స్కూల్ నడుపుతున్న దంపతుల ఆత్మహత్య

  కరోనా మొదటి వేవ్, రెండవ వేవ్ కారణంగా స్కూల్స్ మూత పడటంతో, విద్యార్థులు నుండి ఫీజులు రాక, యాజమాన్యాలు జీతాలు చెల్లించక టీచర్లు ఆర్థికంగా చితికిపోయారు అని ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు. పాఠశాల పున ప్రారంభం రోజు కోయిల్ కుంట్లలో ఒక ప్రైవేటు పాఠశాల నడుపుతున్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొని , స్కూలు నడుపుతున్న దంపతుల ఆత్మహత్య వారి పరిస్థితికి అద్దం పడుతుంది అన్నారు.

  దాదాపు 5 లక్షల మంది బోధనా, బోధనేతర సిబ్బంది ఆర్ధిక కష్టాల్లో ఉన్నారన్న లోకేష్

  దాదాపు 5 లక్షల మంది బోధనా, బోధనేతర సిబ్బంది ఆర్ధిక కష్టాల్లో ఉన్నారన్న లోకేష్

  పాఠశాల నిర్వహణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురై వారు బలవన్మరణానికి పాల్పడ్డారని నారా లోకేష్ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. ఏపీలో దాదాపు 12 వేల కంటే ఎక్కువ ఉన్న ప్రైవేటు పాఠశాలలో 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారని, మార్చి 2020 లో లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుండి ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం లేదని, గత ఐదు నెలలలో స్కూల్స్, కాలేజెస్, విశ్వవిద్యాలయాలలో పనిచేసే ఎంతోమంది బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది దాదాపు 5 లక్షల మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని నారా లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు.

  టీచర్లు కూలీనాలీ చేసుకునే దయనీయమైన స్థితిపై లేఖలో జగన్ కు వివరించిన లోకేష్

  టీచర్లు కూలీనాలీ చేసుకునే దయనీయమైన స్థితిపై లేఖలో జగన్ కు వివరించిన లోకేష్

  ప్రభుత్వం ప్రైవేటు టీచర్ ల విషయంలో ముందు గానే సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు కూరగాయలను విక్రయిస్తున్నారని ,వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు అని, భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని లేఖ ద్వారా జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. గురువులను గురించి ఎన్నో ప్రసంగాలు ఇచ్చిన సీఎం జగన్ ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి తక్షణ సహాయం అందించడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నారా లోకేష్ పేర్కొన్నారు.

  ప్రైవేట్ టీచర్ల జీవనోపాధికి భరోసా ఇవ్వాలని, ఆదుకోవాలని విజ్ఞప్తి

  ప్రైవేట్ టీచర్ల జీవనోపాధికి భరోసా ఇవ్వాలని, ఆదుకోవాలని విజ్ఞప్తి

  భారతీయ సంస్కృతి, సామాజిక విలువలను తీర్చిదిద్దే గురువులకు ప్రభుత్వం బాసటగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ప్రైవేటు ఉపాధ్యాయులకు తోచిన సహాయాన్ని అందించాయని, ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవనోపాధికి తగిన భద్రత ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ తన లేఖ ద్వారా పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే బోధన సిబ్బందిని, బోధనేతర సిబ్బందిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ స్పష్టం చేశారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి ప్రైవేట్ స్కూల్ టీచర్లు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు నారా లోకేష్ .

  English summary
  Nara lokesh wrote a letter to CM Jagan on private teachers problems. teachers are facing dire situations due to corona. TDP national general secretary Nara Lokesh demanded immediate support for financially distressed private teachers .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X