గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజల నోట్లో మట్టికొట్టారు: జగన్ ఇళ్ల ఫొటోలు పెట్టి దుమ్మెత్తిపోసిన నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామన్నారు.. నిరుద్యోగులకు ఉద్యోగాలన్నారు.. వాటి ప్రస్తావనే లేదంటూ జగన్ సర్కారుపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

మీ ఎస్టేట్లు, ప్యాలెస్‌లు ఇవ్వండి..

‘వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్ లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇవ్వండి. లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు వస్తాయి' అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నారా లోకేష్ ప్రశ్నించారు.

పేదల భూములు లాక్కుని..

‘పేదవాళ్ళకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని తిరిగి పేదలకు పంచుతా అనడం వైఎస్ జగన్ రివర్స్ టెండరింగ్ కి పరాకాష్ట. పథకాల పేరు మార్పు కోసం, పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న, భూములు ఎందుకు లాక్కుంటున్నారు' అని నారా లోకేష్ వైసీపీ సర్కారును నిలదీశారు.

యువతకు తీరని నష్టం..

యువతకు తీరని నష్టం..

‘నిరుద్యోగులకు అండగా నిలిచిన నిరుద్యోగ భృతి కార్యక్రమాన్ని ఎత్తేసి యువత వ్యతిరేకిగా నిలిచారు. వైఎస్ జగన్. రాష్ట్ర యువతకి తీరని నష్టం చేస్తున్న వైకాపా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ యువతకి అండగా పోరాటానికి సిద్ధం అవ్వాలని తెలుగు యువత నాయకులకు దిశానిర్దేశం చేశాను' అని నారా లోకేష్ వివరించారు.

తుగ్లక్ పాలనలోనే ఇంతే..

తుగ్లక్ పాలనలోనే ఇంతే..

‘తెలుగు యువత వర్క్ షాప్ లో పాల్గొన్నాను. టిడిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలతో పోటీ పడింది. ఇప్పుడు తుగ్లక్ గారి పాలనలో ఆంధ్రప్రదేశ్, బీహార్ తో పోటీ పడే పరిస్థితికి వచ్చేసింది.వచ్చే కంపెనీలను వద్దు పొమ్మంటున్నారు, ఉన్న కంపెనీలను తరిమేస్తున్నారు' అని నారా లోకేష్.. జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

Chandrababu Naidu Funny Speech In Praja Chaitanya Yatra | Oneindia Telugu

ప్రజల నోట్లో మట్టికొట్టారు..


‘అన్న క్యాంటిన్ ఎత్తేశారు. ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ఒక్క అవకాశం ఇస్తే నట్టేట ముంచారు. 9 నెలల తుగ్లక్ పాలన పై గుక్క తిప్పుకోకుండా...' అంటూ నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ మహిళకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు.

English summary
TDP leader nara lokesh slams ys jagan for his govt policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X