గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇసుక కొరతపై ఆందోళన.. లోకేష్ నిరాహార దీక్ష

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇసుక కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై విమర్శలను ఎక్కుబెడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆపార్టీ నేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రిలే నిరాహర దీక్ష చేపట్టేందుకు సిద్దమయ్యారు. ఇసుక కొరతకు నిరసనగా బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేపట్టనున్నట్టు పార్టీ శ్రేణులు తెలిపారు. కాగా దీక్ష ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నట్టు చెప్పారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలించేందుకు పార్టీ శ్రేణులు సమాయాత్తమవుతున్నారు.

ఇసుక విధానంపై ఏపీ ప్రభుత్వం నూతన విధానం తీసుకువచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా మారింది. గత కోద్ది రోజులుగా ఇసుక లభ్యం కాకపోవడంతో భవన నిర్మాణ కార్మికుల వారి రోజువారి జీవనోపాధికి ఇబ్బందిగా మారింది. ఈనేపథ్యంలోనే కార్మికులు ఆందోళన పట్టారు. దీనికి తోడు ప్రతిపక్షపార్టీలుచ, జనసేనతో పాటు టీడీపీలు ఇసుక కొరతపై పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఆయా జిల్లాల స్థాయిలో కార్మికులతో కలిసి నిరసనలు వ్యక్తం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దీంతో ఆయా జిల్లాల్లో ఇసుక కోరతపై అందోళనలు కొనసాగుతున్నాయి.

Nara Lokesh will take the protest of the shortage of sand in AP

ఇందులో భాగంగానే టీడీపీ అధినేత కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ ఒకరోజు నిరహార దీక్ష చేపట్టనున్నారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం అయిదు గంటలకు వరకు రిలే నిరాహారా దీక్షలో లోకేష్ కూర్చోనున్నారు. మరోవైపు ఇసుక ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇది ప్రభుత్వ కుట్రగా ఆయన అభివర్ణించారు. ఇక ఇసుకు కోరతపై సీఎం జగన్ సైతం రంగంలోకి దిగారు. వారం రోజుల పాటు సమస్యను అధిగమించేందుకు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. నేరుగా సీఎం సైతం రోజువారి సమీక్ష చేయనున్నట్టు చెప్పారు.

English summary
Nara Lokesh will take the protest of the shortage of sand in AP. He will be protested before the Guntur district collector's office on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X