గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెల్లి నడవడికపై అనుమానం.. ఆవేశానికి లోనై గొంతు నొక్కి.. వీడిన గుంటూరు మర్డర్ మిస్టరీ

|
Google Oneindia TeluguNews

గుంటూరులో జరిగిన తనూష హత్య కేసు మిస్టరీ వీడింది. తన చెల్లిని అన్న కుమారస్వామి హతమార్చాడని పోలీసులు నిర్ధారించారు. చెల్లిని బాగుండాలని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగిందని.. ఆవేశానికి గురైన కుమారస్వామి గొంతు నొక్కి హతమార్చాడని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్న సంగతి తెలిసిందే.

బాగుండాలని చెబితే..

బాగుండాలని చెబితే..

నరసరావుపేటలోని లింగంగుంట్ల కాలనీలో లక్కన చిన్న బసవయ్య ఫ్యామిలీ ఉంటోంది. బసవయ్య కుమారుడు కుమారస్వామి, కూతురు తనూషతో కలిసి ఉంటున్నారు. భర్తతో పడకపోవడంతో భార్య వేరుగా ఉంటోంది. అయితే బంధువుల ఇంట్లో పెద్దకర్మ కోసం శుక్రవారం వెళ్లారు. వారి కుమార్తె అనూష, కుమారుడు కుమారస్వామిని మాత్రం ఇంటికి పంపించారు. వారిద్దరూ నరసరావుపేటకు రాత్రి 8 గంటల సమయంలో చేరుకున్నారు. ఇంట్లో ఉన్న తన చెల్లిని మంచిగా ఉండాలని కుమారస్వామి నచ్చజెప్పాడు.

డ్రామాలాడిన కుమారస్వామి..

డ్రామాలాడిన కుమారస్వామి..

నడవడిక మార్చుకోవాలని చెల్లిని కుమారస్వామి కోరాడు. కానీ అందుకు ఆమె కూడా తన స్వేచ్చ అంటూ మాట్లాడటం నచ్చలేదు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. స్వతహాగా ఆవేశపరుడైన కుమారస్వామి.. తన చెల్లి గొంతు పట్టుకొన్నాడు. ఊపిరిరాడకుండా చేసి హతమార్చాడు. తర్వాత తెల్లవారి మాత్రం కొత్త నాటకం ఆడాడు. రాత్రి 2 గంటల సమయంలో ముగ్గురు వచ్చి.. తన చెల్లిపై దాడిచేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

అనుమానం..?

అనుమానం..?

స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి ముగ్గురు వచ్చారని కుమారస్వామి చెబితే పోలీసులు విశ్వసించలేదు. కొత్త వారు ఎవరూ రాలేదని కాలనీవాసులు కూడా చెప్పారు. దీనికితోడు శునకాలు కూడా కుమారస్వామి వద్ద ఆగడంతో అనుమానం వచ్చింది. అతనిని అదుపులోకి తీసుకొని తమదైనశైలిలో విచారిస్తే అసలు నిజం బయటపడింది.

వినకపోవడంతోనే..

వినకపోవడంతోనే..


తన చెల్లిన హతమార్చినట్టు పోలీసుల ముందు కుమారస్వామి అంగీకరించాడు. చెప్పినట్టు వినకపోవడంతోనే హత్య చేశానని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు చనిపోగా.. మరొకరు జైలుకు వెళ్లనుండటంతో బసవయ్య దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

English summary
narasaraopet murder case chase by police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X