గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎడ్లపాడు ఘటనపై గుంటూరు పోలీసులు ఏం చెబుతున్నారు?: బీజేపీ నేతలకు సాక్ష్యాలు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహస్వామి వారి విగ్రహం ఉన్న ఓ గుట్టను క్రైస్తవ మిషనరీ మాఫియా అక్రమంగా ఆక్రమించుకుందంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు చేస్తోన్న ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహ స్వామి విగ్రహం ఉన్న గుట్టకు.. శిలువను నెలకొల్పాలరంటూ బీజేపీ నేతలు చేసిన ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను వారు విడుదల చేశారు. ఓ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గుంటూరు జిల్లా ఎడ్లపాడులో సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహస్వామి వారి విగ్రహం ఉన్న ఓ గుట్టను క్రైస్తవ మిషనరీ మాఫియా అక్రమంగా ఆక్రమించుకుందంటూ బీజేపీ ఏపీ సహ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్, అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలను వారు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో హిందువులు జీవించే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేవాలయాలుపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాము నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని చెప్పారు.

No Hindu religious structures were desecrated, say Guntur Police

ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే గుంటూరు జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. స్థానిక పోలీసులు, తహశీల్దార్ సంఘటనా స్థలానికి వెళ్లారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, వివరాలను సేకరించారు. బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు అనుగుణంగా ఎడ్లపాడు గుట్టపై ఎలాంటి ఆక్రమణలు చోటు చేసుకోలేదని నిర్ధారించారు. సీతమ్మ తల్లి పాదముద్రలు, నరసింహ స్వామి విగ్రహం ఉన్న ప్రాంతం చుట్టుపక్కల ఎలాంటి క్రైస్తవ ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. శిలువను గానీ, ఇతర క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించిన కట్టడాలేవీ లేవని ధృవీకరించారు. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

Recommended Video

#TOPNEWS: BJP Leader పై చెప్పు దాడి, ఆ టీవీ ఛానెల్‌ను,పేపర్‌ను బహిష్కరిస్తున్నట్లు BJP ప్రకటన...!!

బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు అనుగుణంగా సంఘటనా స్థలంలో ఎలాంటి ఆక్రమణలు చోటు చేసుకోలేదని గుంటూరు జిల్లా రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ విశాల్ గున్ని తెలిపారు. అవి రెండూ వేర్వేరు ప్రాంతాలని వివరించారు. శాంతిభద్రతలను రెచ్చగొట్టేలా, మత విధ్వేషానికి సంబంధించిన ఎలాంటి చర్యలను తాము సమర్థించలేమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ కూడా వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, ఓ వీడియో క్లిప్‌ను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీనిమీద పోలీసులు, తహశీల్దార్ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

English summary
The police in Guntur district have clarified that neither such thing occurred, nor any Hindu religious structure was desecrated on Tuesday. Guntur Rural SP Vishal Gunni stated that no Hindu religious structures were desecrated and clarified that Sita’s footmarks did not exist on the hillock where the cross was raised.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X