గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగళగిరిలో రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ మకాం ...ఇందుకేనా !!

|
Google Oneindia TeluguNews

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు మంగళగిరిలో ఉండనున్నారు. నేడు, రేపు మంగళగిరిలోనే ఉండి పార్టీ శ్రేణులతో చర్చలు జరపనున్నారు . ఈ మధ్యాహ్నం మంగళగిరి సమీపంలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన చేరుకొని రెండు రోజుల పాటు పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, జనసేన నుండి కీలక నేతలు పార్టీ వీడి వెళ్ళిపోవటానికి గల కారణాలు, గత ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై ఆయన సమీక్షా సమావేశాలు జరుపుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

స్టిక్కర్ సీఎం: చంద్రబాబుతో పోలుస్తూ జగన్‌పై పవన్ కళ్యాణ్ నిప్పులుస్టిక్కర్ సీఎం: చంద్రబాబుతో పోలుస్తూ జగన్‌పై పవన్ కళ్యాణ్ నిప్పులు

అంతే కాదు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపధ్యంలో దీనిపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలోకి వెళ్తే పార్టీ కార్యక్రమాలపై పెద్ద దృష్టి పెట్టడని జనసేన నేతలు భావిస్తున్న నేపధ్యంలో పవన్ తో ఈ విషయంపై వారు మాట్లాడనున్నారని తెలుస్తుంది. పవన్ ఈ నెఇరనయమ్ ఎందుకు తీసుకున్నారు. రెంటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్న దానిపై వారు పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నారు.

Pavan stays in Mangalgiri for two days ... reason is ..

త్వరలో వస్తాయని భావిస్తున్న మున్సిపల్ ఎన్నికల గురించి , పార్టీ బలోపేతం చెయ్యటానికి తీసుకోవాల్సిన చర్యలు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు, విశాఖలో నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనసేన తలపెట్టిన ర్యాలీ గురించి కూడా చర్చ సాగనుంది అని తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో జనసేన పార్టీని ముందు నడుపుతూ, అభిమానులను నిలుపుకునేందుకు సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలా అన్న విషయంపైనా పవన్, తన అనుచరులు, కార్యకర్తలతో చర్చిస్తారని తెలుస్తోంది.

English summary
Power star Pawan Kalyan will be in Mangalgiri for two days. Today and tomorrow He will be in mangalagiri. visiting the Janasena Party state office near Mangalagiri this afternoon and will be meeting party workers for two days. Party sources said that he will be reviewing the latest political developments, the reasons behind the party's departure from the Janasena, the aftermath of the last election and the next action plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X