• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దొంగల్లా అర్ధరాత్రి ఎందుకు? ప్రధానికి ఫిర్యాదు చేస్తా: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ నిప్పులు

|

గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇసుక లారీల యాజమానులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటామంటూ పవన్ కళ్యాణ్ భరోసా కల్పించారు.

సినిమాలు చేసుకుంటే ఏ గోల ఉండదు కానీ.: 'జై జనసేన’ అననంటూ పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఆవేదన

పవన్ కళ్యాణ్ ఆవేదన

రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఇది తనను ఎంతో బాధకు గురిచేస్తోందని పవన్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని అన్నారు. ఇసుకను ఆపేయడం ఎంతోమంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ సర్కారుపై ఒత్తిడి..

జగన్ సర్కారుపై ఒత్తిడి..

ఇసుక లారీల యజమానులు తనను కలిసి బాధపడ్డారని.. ఇసుక రవాణా ఆగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రభుత్వ విధానాల వల్ల తమ కుటుంబాలు వీధిన పడ్డాయని వారు వాపోయారని తెలిపారు. ఇసుక కొరత ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైనా ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

దొంగల్లా అర్ధరాత్రి ఎందుకు?

దొంగల్లా అర్ధరాత్రి ఎందుకు?

ప్రభుత్వ పరిపాలన తీరు చాలా బాధ కలిగిస్తోందన్నారు. ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దొంగల్లాగా.. ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ అర్ధరాత్రి పూటే ఎందుకని ప్రశ్నించారు. నిమిషాల వ్యవధిలోనే ఇసుక దొరకకుండా పోతోందన్నారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు పవన్ కళ్యాణ్.

రాజధాని అమరావతిలోనేనా?

రాజధాని అమరావతిలోనేనా?

అసలు అమరావతిలో రాజధాని కడతారా? లేదా? అనే విషయాన్ని జగన్ సర్కారు స్పష్టం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రాయలసీమ నుంచి లాయర్లు వచ్చి కలిశారని.. హైకోర్టు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అడుగుతున్నారని చెప్పారు. రాయలసీమ నుంచే ఎక్కువ మంది సీఎంలు వచ్చారని, అయినా రాష్ట్ర విభజన దగ్గరనుంచి ఇప్పటి వరకూ సమస్యలు తీరలేదని మండిపడ్డారు.

గందరగోళం ఆపాలి.. బాధ్యతతో..

గందరగోళం ఆపాలి.. బాధ్యతతో..

రాజధాని ఉందో లేదో తెలియడం లేదని.. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయాల వెనుక కోట్ల మంది ప్రజలు ఉన్నారనే విషయం మరచిపోవద్దని అన్నారు. హైకోర్టులో కప్పు టీ కూడా దొరకడం లేదు.. బెంచీలు కూడా లేవు.. సరైన వసతుల్లేవు.. అసలు రాజధాని కడతారా? కట్టరా? హైకోర్టును రాయలసీమకు తరలిస్తారా? ఇలాంటి అంశాలను స్పష్టం చేయాలి. వీటిపై గందరగోళం ఆపాలని జగన్ సర్కారుకు పవన్ కళ్యాన్ సూచించారు. అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రశ్నించినవారిపై విమర్శలు సరికాదన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబర్ 3న విశాఖలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

జగన్.. ప్రధానికి ఫిర్యాదు చేస్తా..

జగన్.. ప్రధానికి ఫిర్యాదు చేస్తా..

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 486పై ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి, కేంద్ర ఆర్థికమంత్రికి, జీఎస్టీ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. కేంద్రం విడుదల చేసిన నిధులకు ఈ జీవో భంగం కలిగిస్తోందన్నారు. జగన్ సర్కారులానే ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena President Pawan Kalyan on Friday lashed out at YS Jaganmohan Reddy Government's policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more