గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భవిష్యత్ కార్యాచరణ.. రాజధానిపై పోరుకు కీలక నిర్ణయం ప్రకటించనున్న పవన్?

|
Google Oneindia TeluguNews

మంగళగిరిలో నేడు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి పార్టీ నేతలంతా హాజరుకానున్నారు. రాజధాని అంశం, స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా రాజధానిపై పోరుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించే అవకాశం ఉంది. కార్యాచరణలో భాగంగా భారీ కవాతుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా నేతలతో పవన్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.

 భారీ కవాతుకు ప్లాన్ :

భారీ కవాతుకు ప్లాన్ :

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలన్న డిమాండుతో రాజధాని ప్రాంతం నుండి విజయవాడ వరకు భారీ కవాతు చేపట్టాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాల ఉద్యమమేనని అధికార పార్టీ విమర్శిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కవాతుకు జన సమీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. సమావేశం అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై :

స్థానిక సంస్థల ఎన్నికలపై :

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇంచార్జిల నియామకం,ఎన్నికల కసరత్తుపై పవన్ చర్చించనున్నారు. పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్నవారికే టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న పవన్.. అభ్యర్థుల ఎంపికలో ఆచీ తూచీ వ్యవహరించనున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నవారికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన చెబుతున్నట్టు సమాచారం.

ఆ రెండు పార్టీలు వైఖరి చెప్పాలని డిమాండ్

ఆ రెండు పార్టీలు వైఖరి చెప్పాలని డిమాండ్


శుక్రవారం పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వంతో పాటు బీజేపీ,కాంగ్రెస్ కూడా తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్రానికి కూడా బాధ్యత ఉందని,కేంద్ర పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు. అఖిలపక్ష భేటీ నిర్వహించి.. అమరావతి రైతులతో చర్చించిన తర్వాతే రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రాజధాని ఉద్యమం :

రాజధాని ఉద్యమం :

మరోవైపు రాజధానిని తరలించవద్దంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. అయితే రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు.దీక్షలకు అనుమతి లేదని పోలీసులు మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మందడం, తుళ్లూరులో గ్రామస్తులు టెంట్‌ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.

English summary
Janasena Chief Pawan Kalyan held a meet with party leaders today in Mangalgiri to discuss over AP capital issue and local body elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X