టార్గెట్ చంద్రబాబు : మోదీ ప్రసంగం లక్ష్యం : జనసమీకరణ..నిరసనల్లో టిడిపి వర్సెస్ బిజెపి.
బిజెపి- టిడిపి మధ్య స్నేహ బంధం వీడిన తరువాత ప్రధాని మోదీ తొలిసారి ఏపికి వస్తున్నారు. ఇందుకు సంబంధిం చి బిజెపి నేతలకు జన సమీకరణ సవాల్ గా మారింది. అదే సమయంలో ఏపి అధికార పార్టీ మొదలు జేఏసి నిరసనల కు పిలుపు ఇవ్వటం తో టెన్షన్ మొదలైంది. ఈ సభ ద్వారా చంద్రబాబు లక్ష్యంగా ప్రధాని మోదీ కేంద్ర సాయం..రాజ కీయంగా చోటు చేసుకున్న పరిణామాల మొత్తాన్ని వివరిస్తారని బిజెపి నేతలు చెబుతున్నారు.

ప్రజా స్పందన ఉంటుందా..
ఈ నెల 9న ఉదయం ప్రధాని మోదీ 11.15 గంటలకు గుంటూరు చేరుకుంటారు. అక్కడ సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వాటి శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందు కోసం ఏటుకూరు రోడ్డులో పెద్ద ఎత్తున సభా ప్రాంగణాన్ని సిద్దం చేస్తున్నారు. ఎస్పీజి అధికారులు..ఏపి పోలీసు శాఖ ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతంలోనే మోదీ గుంటూరుకు రావాల్సి ఉన్నా..అది రద్దయింది. ఇక ఇప్పుడు ప్రధాని సభకు భారీగా జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. అయితే, అమిత్ షా సభ ఉదంతం పార్టీ నేతలను వెంటాడుతోంది. ఏపిలో మోదీ పెద్ద ఎత్తున వ్యతిరేకత తీసుకురావటంలో టిడిపి సఫలమైంది. దీంతో.. జన స్పందన పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనకు రాజకీయం గా మద్దతు ఉన్న ఇతర ప్రాంతాల నుండి జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.

నిరసనల పైనా ఆందోళన..
ఇప్పటికే ప్రధాని మోదీ ఏపి పర్యటన పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఖాళీ కుండలు..మట్టి తో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో నల్ల బెలూన్లు ఎగరేయాలని పిలుపునిచ్చా రు. హోదా సాధన సమితి తో పాటుగా జేఏసి, టిడిపి, కాంగ్రెస పార్టీలు నిరసనల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే నిఘా సిబ్బంది పెద్ద ఎత్తున మొహరించారు. ఇక జనసమీకరణ పై బిజెపి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. కన్నా కు వ్యక్తిగతం గా జనబలం ఉన్న పెదకూరపాడు, గుంటూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి సరిగ్గా ప్రధాని సభ జరిగే రోజునే వందలాది బస్సుల్లో జనాన్ని పోలవరం సందర్శనకు తీసుకెళుతున్నారని తెలిపారు. ఆదివారం భారీ ఎత్తున శుభకా ర్యాలు ఉండటం కూడా జన సమీకరణకు కొంత అడ్డంకిగా ఉందని కూడా ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
ప్రధాని సభకు టీడీపీ అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు లక్ష్యం ప్రసంగం..
ప్రధాని మోదీ గుంటూరు సభలో దాదాపు 45 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ప్రధానంగా ఏపికి కేంద్రం చేసిన సాయం పై వివరించనున్నారు. అదే విధంగా..కేంద్ర ప్రభుత్వాన్ని..ప్రధానిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చే సుకొని టిడిపి అధినేత చేస్తున్న విమర్శలకు గుంటూరు కేంద్రంగా ప్రధాని సమాధానం చెబుతారని..అనేక ఆసక్తి కర అంశాలను ఏపి ప్రజల ముందు ఉంచుతారని బిజెపి నేతలు చెబుతున్నారు. రాజకీయ అంశాల పైనా ప్రధాని స్పంది స్తారన్నది పార్టీ నేతల అంచనా. కేంద్రం నుండి టిడిపి ఎందుకు బయటకు వచ్చిందీ.. కేంద్రంతో నాడు చంద్రబాబు ఏ రకంగా సంప్రదింపులు జరిపారు..ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి ఏ రకంగా వ్యవహరించారో ప్రధాని స్వ యంగా ఏపి ప్రజలకు వివరిస్తారని పార్టీ నేతలు ఇప్పటికే చెబుతున్నారు. దీంతో...అటు నిరసనలు..ఇటు ప్రధాని సభ లో ప్రసంగం పై అందరి దృష్టి నెలకొని ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!