గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని మహిళలపై పోలీసుల దాడి.. నిరసనగా అమరావతి బంద్..ఎన్‌హెచ్‌ఆర్సీకి టీడీపీ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Amaravati farmers Protest : Police Officers Rude Behavior With AP Capital Women Farmers

రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు ఉద్రిక్తతలకు కారణం అయ్యింది . ఈ రోజు అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె నేపధ్యంలో మందడంలో మహిళలు ఆందోళనకు దిగగా పోలీసులు వారిపై దాడి చేసి మరీ అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపధ్యంలో రాజధాని రైతులు భగ్గుమంటున్నారు.

రాజధాని అమరావతినే .. కాదంటే కడప రాజధాని చెయ్యాలని కొత్త వాదనరాజధాని అమరావతినే .. కాదంటే కడప రాజధాని చెయ్యాలని కొత్త వాదన

మందడంలో మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు .. ఉద్రిక్తత

రాజధాని అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్నమహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వాహనాన్ని వెళ్లనీయకుండా గ్రామస్తులు అడ్డుకుని వాహనం ముందు రోడ్డుపైనే పడుకున్నారు. తీవ్ర నిరసనతో వెనక్కి తగ్గిన పోలీసులు వ్యాన్ ఎక్కించిన మహిళలను కిందకు దించి వేశారు. ఈ క్రమంలో పోలీసులు మహిళలపై దాడి చేశారని రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా రైతులపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారని రైతుల ఆరోపణ

మహిళా రైతులపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారని రైతుల ఆరోపణ

మహిళా రైతులపై పోలీసులు దాడి చేశారని చున్నీతో ఓ మహిళా రైతు గొంతును పోలీసులు నులిమేశారని రైతులు ఆరోపించారు. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయిందని రైతులు చెప్పారు. అసభ్యకరంగా తమను దూషించారని మహిళల ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ సమయంలో తమ బంగారు గొలుసులు పోయాయని, మంగళసూత్రాలను కూడా పోలీసులు లాగేశారంటూ మహిళలు వాపోయారు. ఇక మహిళలపై పోలీసుల దాడికి నిరసనగా రేపు అమరావతిలోని రాజధాని గ్రామాల బంద్ కు పిలుపునిచ్చారు.

మహిళలపై దాడిని ఖండించిన టీడీపీ .. ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు


ఇక రైతులు, మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు ఖండించారు. రాజధానికి భూములిచ్చిన రైతులపై దాడి హేయమని తప్పబట్టారు. రైతులపైకి పోలీసుల వాహనాలు తీసుకెళ్లి గాయపర్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, మహిళలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని చంద్రబాబు, లోకేష్ డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై అమరావతిలో పోలీసుల తీరుపై ఎన్‌హెచ్‌ఆర్సీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. మహిళా నిరసనకారులపై పోలీసులు దాడి చేశారని జాతీయ మానవ హక్కుల చైర్మన్‌కు ఎంపీ కనకమేడల ఫిర్యాదు చేశారు.రాజధానిలో మహిళలపై జరిగిన దాడి హేయమైన చర్యగా టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

English summary
TDP chief Chandrababu and Nara Lokesh condemned the police crackdown on farmers and women. TDP complained to the NHRC about the police action in Amaravati. MP Kanakamedela complained to the National Human Rights Chairman that the police had attacked the women protesters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X