గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ శిబిరం నుండి బాధితుల తరలింపు : గ్రామాలకు పంపేసిన పోలీసులు: టీడీపీ నేతల అరెస్ట్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

నిర్భందించినంత మాత్రాన,ఈ పోరాటం ఆగదన్న చంద్రబాబు || TDP Chief Chandrababu Warns Jagan Government

వైసీపీ భాదితులుగా చెబుతూ టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరంలో ఆశ్రయం పొందిన వారిని పోలీసులు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల శిబిరం కొనసాగుతుంది..ఛలో ఆత్మకూరు కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. శిబిరం మరి కొద్ది రోజులు కొనసాగిస్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు వారిని స్వగ్రామాలకు తరలించారు. ఆర్డీఓ స్థాయి అధికారి వారి నుండి పూర్తి వివరాలు సేకరించారు. శిబిరానికి ఎందుకు వచ్చారు..గ్రామంలో పరిస్థితి ఏంటి..ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు..తిరిగి గ్రామానికి వెళ్లటానికి సిద్దమేనా అనే వివరాలు సేకరించి వారి గ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేసారు. ముందుగా శిబిరంలో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో...ఛలో ఆత్మకూరు వ్యవహారం తాత్కాలిక సద్దుమణిగింది.

యరపతినేని, కోడెల, చింతమనేని అరాచకాలు బయటకు రాకుండా టీడీపీ రాద్దాంతం చేస్తోంది:అంబటియరపతినేని, కోడెల, చింతమనేని అరాచకాలు బయటకు రాకుండా టీడీపీ రాద్దాంతం చేస్తోంది:అంబటి

బాధితులను తరలించిన పోలీసులు
తొమ్మిది రోజులుగా టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరంలో వైసీపీ బాధితుల పేరుతో ఆశ్రయం పొందిన వారిని పోలీసులు వారి స్వగ్రామలకు తరలించారు. టీడీపీ వీరిని గ్రామాలకు తీసుకెళ్లేందుకు ఛలో ఆత్మకూరు కు పిలుపు ఇచ్చింది. అయితే, అక్కడ 144 సెక్షన్ కారణంగా టీడీపి ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో వైసీపీ సైతం టీడీపీ బాధితులను గుంటూరు తీసుకొచ్చింది. వారు సైతం ఛలో ఆత్మకూరు కు పిలుపునిచ్చారు. దీంతో రాజకీయంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు తమను అడ్డుకోవటంతో ఈ కార్యక్రమం వాయిదా వేయటం లేదని..తాము పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు నిర్వహిస్తామని..అప్పటి వరకు శిబిరం కొనసాగుతుందని చంద్రబాబు ప్రకటించారు. దీంతో..ముందుగా శిబిరంలో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసారు. తరువాత అక్కడ ఆర్డీఓ స్థాయి అధికారి వచ్చి ప్రతీ బాధితుడి నుండి వివరాలు సేకరించారు. శిబిరానికి ఎందుకు వచ్చారు..గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు.. ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారనే అంశాల పైన ఆరా తీసారు. వారి నుండి సుముఖుత వ్యక్తం అయిన వెంటనే వారిని స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేసారు. గుంటూరు నుండి పోలీసు రక్షణతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వారిని తరలించారు. ఆ సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Police lifted TDP camp and shifted victims to own villages

అయిదు గ్రామాల బాధితుల తరలింపు
పల్నాడులోని మొత్తం అయిదు గ్రామాలకు చెందిన బాధితులను పోలీసులు తరలింపు మొదలు పెట్టారు. అందులో బాగంగా ప్రత్యేకంగా వాహనాలు సిద్దం చేసారు. ముందుగా వారి నుండి సేకరించిన సమాచారం మేరకు వారు కోరుకున్న చోటకు తరలించే ప్రక్రియ ప్రారంభించారు. అదే సమయంలో గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. తొమ్మది రోజులుగా రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీసిన ఈ పల్నాడు బాధితుల వ్యవహారం పైన ఈ రోజు ఉదయం నుండి చంద్రబాబు సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేసారు. అదనపు డీజీ అధికారి గుంటూరులోనే బస చేసారు. ఎప్పటికప్పుడు కావాల్సిన సూచనలు చేసారు. అటు వైసీపీ సైతం పోటీగా ఛలో ఆత్మకూరుకు పిలుపు నివ్వటంతో రెండు పార్టీలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆత్మకూరులో అవి రాజకీయ గొడవలు కావని.. కేవలం రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలని స్థానిక పోలీసులు చెబుతున్నారు. అక్కడ టీడీపీ నేతల కారణంగా ఇబ్బందులు పడిన బాధితులను వైసీపీ నేతలు గుంటూరుకు తీసుకొచ్చారు. వారు టీడీపీ నేతల కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. టీడీపీ నేతలు వెళ్లినా వెళ్లకున్నా తాము ఆత్మకూరు వెళ్లి తీరుతామని వైసీపీ నేతలు ప్రకటించారు. వారిని సైతం బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు బాధితులను స్వగ్రామాలకు పంపి వేయటంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా సద్దు మణిగినట్లుగా కనిపిస్తోంది.

English summary
Police lifted TDP camp and shifted victims to own villages. Since nine days camp is running by TDP. TDP and YCP called for Chalo Atmakur created tense in Capital area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X