గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరు దొంగతనం చేయమన్నారు..? : డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్

|
Google Oneindia TeluguNews

కాసేపటి క్రితం ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై అప్పుడే రాజకీయాలు చుట్టుముట్టాయి. మాజీ స్పికర్ పై అధికార పార్టీ నేతలు అనేక ఆరోపణలు చేయడంతో పాటు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఈనేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ శ్రేణులు తీవ్ర అరోపణలు చేశారు. దీంతో వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు పలువురు వైపీపీ ఎమ్మెల్యేలు ఘటుగా స్పందించారు.

ఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలుఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలు

కొడెల శివప్రసాద్ మృతిపై ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేస్తున్నానని చెప్పిన పిల్లి సుభాష్ చంద్రబోస్ , టీడీపీ నేతలు దీన్ని ప్రభుత్వం హత్యగా అభివర్ణిస్తున్నారని అన్నారు. అయితే కొడెల అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో దొంగతనం చేశాడని, అదే విషయాన్ని కోడెల కూడ ఒప్పుకున్నాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు మొఖం చూపించకుండా ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.

Politics have been surrounding the death of former speaker of the ap Kodela Sivaprasad,

మరోవైపు కోడెలపై పెట్టిన కేసులు ఏవి కూడ ప్రభుత్వం పెట్టలేదని, ఆయనపై ఉన్న కేసులన్ని భాదితులు పెట్టినవే అంటూ మంత్రి బోత్స సత్యనారయణ అన్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే క్యాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. ఇక ఆయన మరణంపై అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడ సమగ్ర విచారణ జరపాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోరారు.

English summary
Politics have been surrounding the death of former speaker of the ap Kodela Sivaprasad.tdp leaders have made several allegations on his death,and YCP leaders also have reacted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X