గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లాస్మా డొనేట్ చేసేందుకు కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యే కిలారీ రోశయ్య ఓకే.. స్ఫూర్తిగా నిలిచి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వచ్చి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి, కరోనా సోకిన వారికి ప్లాస్మాను ఎక్కిస్తారు. ఇదివరకు కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే జే సుధాకర్ ప్లాస్మా దానం చేయగా.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే ముందుకొచ్చారు. కలెక్టర్ కూడా ప్లాస్మా డొనేట్ చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న క్రమంలో కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్ చేయడం వల్ల.. వైరస్ సోకిన పిల్లలు, వృద్దులకు ప్లాస్మా ఇచ్చి.. వైరస్‌ను జయించే అవకాశం ఉంది.

రోశయ్య, ఆనంద్ ప్లాస్మా డొనేషన్

రోశయ్య, ఆనంద్ ప్లాస్మా డొనేషన్

గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్లాస్మా దానం చేసేందుకు అంగీకరించారు. రెడ్ క్రాస్ సొసైటీలో ప్లాస్మా దానం చేస్తూ అంగీకార పత్రాలను ఎమ్మెల్యే, కలెక్టర్ అందజేశారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. గత నెలలో 170 కరోనా మరణాలు జిల్లాలో నమోదయ్యాయని గుర్తుచేశారు. కరోనా మరణాల సంఖ్యు తగ్గించేందుకు ప్రభుత్వం ప్లాస్మా డొనేషన్‌ను ప్రోత్సహిస్తోందని వివరించారు. బ్లడ్ బ్యాంక్‌లో ప్లాస్మా సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని.. సేకరించిన ప్లాస్మాను ప్రత్యేక కమిటీ నిర్ణయించిన వారికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.

రూ.5 వేల ప్రోత్సాహకం

రూ.5 వేల ప్రోత్సాహకం

ప్లాస్మా దాతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్లాస్మా దానం చేస్తే రూ.5 వేల ప్రోత్సాహక నగదు అందజేస్తామని ప్రకటించింది. దీంతో వైరస్ తగ్గిన వారు ప్లాస్మాను డోనెట్ చేసేందుకు ముందుకొచ్చే అవకాశం ఏర్పడింది. ప్లాస్మా దాతలకు ప్రోత్సాహక నగదు అందజేయాలని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Recommended Video

గాంధీ ఆసుపత్రి లో రోజు 30 నుండి 50 మంది కరోనాతో చనిపోతున్నట్లు అనుమానం : జగ్గారెడ్డి
ప్లాస్మా అంటే..?

ప్లాస్మా అంటే..?


రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నవారిపై కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే తెల్ల రక్త కణాలు దాడి చేసి వైరస్‌ను నాశనం చేస్తాయి. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది. మరికొందరిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. వారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక కణాలనుపెంచితే వ్యాధిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కించడంతో వారు వేగంగా కోలుకుంటారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాను కరోనా సోకిన రోగిలో ఎక్కించడాన్నే ప్లాస్మా థెరపీ అని పిలుస్తారు.

English summary
ponnur mla kilari rosaiah, guntur collector anand kumar donates plasma
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X