గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు సిద్దం...అప్పుడే సీఎం సినిమా బయటపడుతుంది.. లోకేష్ ట్వీట్ల దాడి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ... వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ వ్యవహారం కొనసాగిందంటూ.. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలుసార్లు ప్రస్తావించారు. దీంతోపాటు అమరావతిలో భూములు కొన్న టీడీపీ నేతల పేర్లను సైతం ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. అయితే ప్రభుత్వం చేసిన ఆరోపణలపై టీడీపీ నేత నారా లోకేష్ సవాల్ విసిరారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ పై విచారణకు సిద్దమని పేర్కోన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం జగన్ విధానాలపై పలు విమర్శలు చేశారు.

ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై సవాల్

ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై సవాల్

అమరావతి తరలింపు, రాష్ట్ర రాజజకీయాలపై టీడీపీ నేత , చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రభుత్వం పై ట్విట్టర్ దాడి కొనసాగించారు. ఈనేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న ప్రచారంపై ఆయన సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలు గడుస్తున్నా... ఇన్‌సైడ్ ట్రేడింగ్ అంటూ... సీఎం జగన్ పాతపాటే పాడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై తాము హైకోర్టు జడ్జితో విచారణకు సైతం సిద్దమని సవాల్ విసిరారు.

సాగర తీరాన జగన్ ఇన్‌సైడ్ ట్రేడింగ్

సాగర తీరాన జగన్ ఇన్‌సైడ్ ట్రేడింగ్


మరోవైపు వైకాపా హయాంలో విశాఖపట్నం, విజయనగరంలో సుమారు 40వేల ఎకరాల్లో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై కూడ సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తే... సీఎం జగన్ సాగరతీరంలో చేసిన ల్యాండ్ మాఫియా సినిమా బయటపడుతుందని అన్నారు. ఈ నేపపథ్యంలోనే రైతులు రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనలు చేస్తున్నా... ప్రభుత్వానికి చెవికెక్కడం లేదని పేర్కొన్నారు.

 ప్రజల దృష్టిని మరల్చేందుకే మూడు రాజధానులు

ప్రజల దృష్టిని మరల్చేందుకే మూడు రాజధానులు

మరోవైపు ప్రభుత్వ పాలనతో ప్రజలను సంతృప్తిపరచలేని వారు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు మూడు , ముప్పై రాజధానులంటూ ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. అసలు సీఎంకు అభివృద్ది అంటే ఎమిటో తెలియదని అన్నారు.మరోవైపు అధికారానికి ముందు రాజధాని అమరావతిలో ఉంటుందని ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడ పెట్టారని , అధికారంలోకి వచ్చిన అనంతరం మాటమార్చి, మడమ తిప్పి అమారావతిని ముంచేశారని పేర్కోన్నారు.

English summary
Nara Lokesh challenged be ready to High Court inquiry on Insider Trading of amaravati lands. He also demanded an inquiry will be for vizag lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X