• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మిగిలి ఉంది 19 రోజులే.. రమ్య హత్య కేసు నిందితుడికి శిక్ష పడాల్సిందే: నారా లోకేశ్

|

రమ్య మర్డర్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇదే అంశంపై టీడీపీ కూడా పోరుబాటకు దిగింది. గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి దిశ చట్టం సాయంతో 21 రోజుల్లోనే శిక్ష వేస్తామని చెప్పారని వైసీపీ సర్కారును ఉద్దేశించి కామెంట్ చేశారు.

రమ్యను ఒక మృగాడు నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్యచేశాడని లోకేశ్ గుర్తుచేశారు. దీనికి సంబంధించి తాను ఇచ్చిన డెడ్ లైన్‌కు ఇంకా 19 రోజులే మిగిలి ఉందన్నారు. దోషులకు ఏం శిక్ష వేయబోతున్నారు?" అంటూ ప్రశ్నించారు. సోదరి రమ్యకు న్యాయం జరగాలని, దిశ చట్టం ద్వారా హంతకుడికి 21 రోజుల్లో శిక్ష పడాలని లోకేశ్ స్పష్టం చేశారు. నిన్న లోకేశ్ పెదకాకాని పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడకపోతే ఆ మరుసటి రోజు నుంచే తమ ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు. ఆ మేరకు నారా లోకేశ్ ఈ కామెంట్స్ చేశారు.

remaining 19 days, nara lokesh on ramya murder case

రమ్య మర్డర్ కేసు ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. లోకేశ్‌పై పోలీసులు 151 సీఆర్పీసీ కింద అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థిని రమ్య కుటుంబానికి అండగా నిలబడడం మేం చేసిన తప్పా? అని ఆయన ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రమ్య హత్య జరిగితే... గన్ కన్నా ముందు వస్తాడన్న జగన్ ఎక్కడికెళ్లారని లోకేశ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత జగన్ రెడ్డి స్పందించడం బాధాకరమని పేర్కొన్నారు. "దిశ చట్టం తెచ్చామని మీరు చెబుతున్నారు. 20 రోజుల్లో గనుక రమ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే 21వ రోజున టీడీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయమే రమ్య హత్యకు దారితీసిందని ఇన్‌ఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌ తెలిపారు. నిందితుడు శశికృష్ణకు, రమ్యకు ఆర్నెల్ల కిందట ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రేమించాలని రమ్య వెంటపడేవాడని, రెండు నెలలుగా మితిమీరి వేధించాడని తెలిపారు. దాంతో శశికృష్ణతో రమ్య మాట్లాడడం మానేసిందని, ఇది మనసులో పెట్టుకున్న శశికృష్ణ పలుమార్లు బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని వెల్లడించారు. చివరికి ఆమెతో వాగ్వాదం జరిగిన అనంతరం కత్తితో నరికి చంపాడని తెలిపారు.

స్థానికులు అడ్డుకుని ఉంటే రమ్య బతికుండేదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల పట్ల యువత దూరంగా ఉంటే మేలని హితవు పలికారు. ఇలాంటి పరిచయాలను ఆసరాగా చేసుకుని వేధించే వాళ్లపై ఫిర్యాదు చేయాలని, రమ్య కూడా ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమోనని ఇన్చార్జి డీఐజీ అన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. మృతురాలి ఫోన్ డేటా నుంచి డిలీట్ అయిన వివరాలను కూడా రాబట్టి, దర్యాప్తును ముందుకు తీసుకెళతామని అన్నారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, దాడులకు సంబంధించి చైతన్యం కలిగించేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని డీజీపీ ఆదేశించారని వెల్లడించారు.

English summary
remaining 19 days only tdp leader nara lokesh on ramya murder case. after that tdp agitate for Punishment for the guilty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X