గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్ టెండరింగ్ అంటే వైసీపీ నేతలు కంపెనీలకు టెండర్ పెట్టడం .. కొత్త భాష్యం చెప్పిన లోకేష్

|
Google Oneindia TeluguNews

ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన రివర్స్ టెండరింగ్ పద్ధతిపై టీడీపీ నేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలో వైసీపీ నేతలు పనులు తమకే ఇవ్వాలని దౌర్జన్యాలకు దిగుతున్నారని మండిపడిన లోకేష్ తనదైన శైలిలో స్పందించారు.

వ్యవసాయ సంక్షోభం వల్లే మహిళలు వ్యభిచారం చేస్తున్నారు .. లోక్ సభలో గోరంట్ల మాధవ్వ్యవసాయ సంక్షోభం వల్లే మహిళలు వ్యభిచారం చేస్తున్నారు .. లోక్ సభలో గోరంట్ల మాధవ్

 జగన్ రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళ్ళమన్నారో అర్ధం అయ్యిందన్న లోకేష్

జగన్ రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళ్ళమన్నారో అర్ధం అయ్యిందన్న లోకేష్

రివర్స్ టెండరింగ్ అంటే వైసీపీ నేతలు కంపెనీలకు టెండర్ పెట్టడం అని లోకేష్ కొత్త భాష్యం చెప్పారు. జగన్ రివర్స్ టెండరింగ్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న వైసీపీ నేతలు కర్నూలులోని అల్ట్రా మెగా సోలార్ పార్కులోకి చొరబడి దౌర్జన్యాలకు పాల్పడ్డారని , అక్కడివారిని తుపాకీతో బెదిరించారని లోకేశ్ ఆరోపించారు. ఇక ఆ విషయానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ను కూడా జత చేశారు. కంపెనీలు ఉండాలంటే తమకు కప్పం కట్టాలని వైసీపీ నేతలు సోలార్ పార్కు యాజమాన్యాన్ని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దోపిడీ, అరాచకం రాజ్యమేలుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఇదేరకంగా కడప జిల్లాలోని మైలవరంలో మరో సోలార్ పార్కులోని ప్యానల్స్ ను వైసీపీ నేతలు ధ్వంసం చేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు .

మెగా ఆల్ట్రా సోలార్‌ పార్కులో వైసీపీ నేతల దౌర్జన్యంపై లోకేష్ ఫైర్

మెగా ఆల్ట్రా సోలార్‌ పార్కులో వైసీపీ నేతల దౌర్జన్యంపై లోకేష్ ఫైర్


ఏపిలో వైసీపి ప్రభుత్వం కొలువుదీరి రెండునెలలు కూడా గడవలేదు . కానీ వైసీపీ నేతలు దౌర్జన్యాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. చిన్న ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా తమకే దక్కాలని అటు ప్రభుత్వ అధికారుల మీద, ఇటు కంపెనీ యాజమాన్యాల మీద దౌర్జన్యానికి దిగుతున్నట్టు తెలుస్తోంది. కర్నూలు లో జరిగిన ఓ సంఘటన అదికార పార్టీ నేతల దౌర్జన్యానికి అద్దం పడుతోందని కంపెనీ ప్రతినిధులు చెప్పుకొస్తున్నారు. కర్నూలు జిల్లాకు తలమానికంగా ఉన్న మెగా ఆల్ట్రా సోలార్‌ పార్కులో వైసీపీ నాయకులు బెదిరింపుల పర్వానికి తెర తీశారని , వాళ్ళు చేసిన అరాచకం ఉదహరిస్తూ లోకేష్ వైసీపీపై నిప్పులు చెరిగారు.

 ఇలా అయితే పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయన్న లోకేష్

ఇలా అయితే పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయన్న లోకేష్


ఇక ఈ ఘటనలపై ‘మీ ఎమ్మెల్యేలు పగులకొడుతోంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తును. మీ వాళ్ళ దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి' అని లోకేశ్ తన ట్వీట్ ద్వారా హెచ్చరించారు. ఇక అంతే కాదు అర్బన్ హౌసింగ్ స్కీమ్ విషయంలో జగన్ తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం సరైనది కాదని పేర్కొన్న లోకేష్ మరో ట్వీట్ లో ప్రజాధనంతో పేదవాడికి అన్ని సౌకర్యాలు ఉన్న ఎన్టీఆర్ ఇళ్లు కట్టడం తప్పు అని మీరనడం సబబు కాదు జగన్ గారు. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇకనైనా సాక్షి పేపర్ చదవడం మాని, పక్కన ఉన్న అధికారులతో మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Lokesh says that reverse tendering means YCP leaders are tendering companies. He remarked that what is meant by reverse tendering of Jagan is now understood. Lokesh alleged that the YCP leaders yesterday infiltrated the Ultra Mega Solar Park in Kurnool and threatened them with a gun. Lokesh Also attached paper clippings for the subject.The YCP leaders have expressed outrage that solar park ownership has been threatened by the companies that they should cover. He said that under the YCP regime, there was a plunder and anarchy. Similarly, Lokesh was angry that YCP leaders had destroyed the panels of another solar park in Mylavaram in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X