గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు వద్ద రోడ్డు ప్రమాదం: స్పాట్‌లో ప్రత్యక్షమైన మంత్రి క్షతగాత్రులను ఆసుపత్రికి

|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ ఆసుప్రతికి తరలించారు. దీనికోసం ఆయన స్వయంగా అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు వద్ద అయిదో నంబర్ జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లా సరిహద్దుల్లోని తడ నుంచి వలస కార్మికులను తీసుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి బయలుదేరిన మినీ బస్సు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురైంది. వలస కార్మికులను ఒడిశా సరిహద్దుల్లోని ఇచ్ఛాపురంలో దింపిన అనంతరం నెల్లూరు జిల్లాకు తిరుగుముఖం పట్టింది. మార్గమధ్యలో గుంటూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తోన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మినీ బస్సు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది.

Road accident near Guntur, injured persons rescued by the Minister Anil Kumar Yadav

అదే సమయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి విజయవాడకు వెళ్తూ.. ఈ ప్రమాదాన్ని చూశారు. వెంటనే స్పందించారు. అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులకు విషయాన్ని చేరవేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని వాహనం నుంచి బయటికి తీసుకుని రావడంలో సహకరించారు. అంబులెన్స్ వచ్చేంత వరకు ఆయన అక్కడే ఉన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

English summary
Road accident accured at National Highway near Guntur in Andhra Pradesh on Thursday. The mini bus coming from Srikakulam district towords Nellore district meet accident on NH 5. Water resource minister Dr P Anil Kumar Yadav, who is on his way to Nellore from Vijayawada rescued the injured persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X