గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న .. మీ నేతల బాధితులకోసం పునరావాస కేంద్రాలు ఎందుకు పెట్టలేదు ?

|
Google Oneindia TeluguNews

చంద్రబాబు తలపెట్టిన చలో పల్నాడుపై రోజా విమర్శల వర్షం కురిపించారు. పల్నాడులో పరిస్థితిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వైఎస్సార్‌ సీపీ నేత, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా పేర్కొన్నారు.

టీడీపీని రక్షించే వాడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే .. మరోమారు తెరపైకి యువనాయకుడి అంశంటీడీపీని రక్షించే వాడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే .. మరోమారు తెరపైకి యువనాయకుడి అంశం

శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ చక్కటి పాలన అందిస్తుంటే ఓర్వలేకే చంద్రబాబునాయుడు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు ఆడిస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబుకు రోజా ఒక సూటి ప్రశ్నను సంధించారు. చంద్రబాబు నాయుడు పునరావాస కేంద్రాలు పెట్టాల్సింది కోడెల , యరపతినేని, దేవినేని, బోండా ఉమా వంటి టిడిపి నేతల బాధితుల కోసం అని, అసలు చంద్రబాబు పునరావాస కేంద్రాలు తమ నేతల బాధితులకు ఎందుకు పెట్టలేదని రోజా ప్రశ్నించారు.

Recommended Video

చంద్రబాబు ను ముఖ్యమంత్రి గా సంబోధించిన రోజా || Roja Metioned Chandrababu As C M In Her Speech
Rojas straightforward question to Chandrababu and fired on chalo palnadu

కోడెల, యరపతినేని వంటి కీచకుల నుంచి విముక్తి పొందామని పల్నాడు ప్రజలు ఆనందంగా వున్నారన్నారు రోజా. ప్రజల్లో జగన్ కు పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు అని రోజా విమర్శించారు. పల్నాడు ప్రశాంతంగా ఉందని పేర్కొన్న రోజా చంద్రబాబు ఇప్పటికైనా నాటకాలు ఆపాలని లేకుంటే ప్రజలు తరిమి కొడతారని తేల్చి చెప్పారు. కావాలని జగన్ పాలన పై బురద జల్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని రోజా పేర్కొన్నారు.

English summary
Roja, who visited Thirumala Sri Venkateswaraswamy on Saturday, spoke to the media. Roja has expressed outrage on Chandrababu Naidu.He is playing dramas with paid artists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X