గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ షాక్: ఆరుగురు మృతి.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లాలో విషాదం జరిగింది. రొయ్యల చెరువు వద్ద విద్యుత్‌ షాక్‌ కొట్టింది. దీంతో ఆరుగురు చనిపోయారు. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఈ విషాద ఘటన జరిగింది. గురువారం అర్ధరాత్రి రొయ్యల చెరువు దగ్గర ఒడిశా వాసులు కాపలాగా పనిచేస్తున్నారు. అర్ధరాత్రి చెరువు గట్టుపై నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడి ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

వెంటనే స్థానికుల పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతుల వివరాలను వెల్లడించారు. విద్యుత్ షాక్‌తో ఆరుగురు చనిపోవడం బాధ కలిగిస్తోంది. తమ వారు చనిపోయారని ఒడిశా వాసులు బోరున విలపిస్తున్నారు. పొట్ట కూటీ కోసం ఇక్కడికీ వస్తే.. ఇలా జరిగిందని అంటున్నారు. ఉపాధి కోసం వస్తే కానరాని లోకాలకు వెళ్లారని గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతులను మ్మూర్తి, కిరణ్‌, మనోజ్‌, మహేంద్ర, నవీన్‌, పండబోగా గుర్తించారు.

six people dead due to power shock

రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవ దహనం అయ్యారు. ఒడిశాకు చెందిన ఆరుగురు వ్యక్తులు లంకెవాని దిబ్బ వద్ద ఉన్న రొయ్యల చెరువు కాపలాకు కుదిరారు. నిన్న రాత్రి చెరువు పక్కనే ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయా రు. ఇదే సమయంలో కరెంటు తీగలు రేకుల షెడ్‌కి తగిలి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మంటల్లో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. వారి మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తుండగా.. ఈ దుర్ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అధికారులు ఆ ప్రాంతానికి మీడియాను అనుమతించడం లేదు. విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తెగిపోయాయని విశ్వసనీయంగా తెలిసింది. ఎవరో కావాలని చేసినట్టు తెలియరాలేదు అని చెప్పారు. దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఎంక్వైరీలో నిజ నిజాలు తెలిసే అవకాశం ఉంది.

English summary
six people dead due to power shock at guntur prawns lake. all are belongs to odisa. case registered police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X