గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సరస్వతి దేవి విగ్రహాం ధ్వంసం, మందు కూడా పోశారట.. నిజం కాదు: ఎస్పీ..

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లాలో సరస్వతి, కర్నూల్ జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాలు ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఇదీ పీక్‌కి చేరగా.. పోలీసులు స్పందించారు. అదీ ఫేక్ అని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టంచేశారు. జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ విశ్వసించొద్దు అని సూచించారు. ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.

నరసరావుపేటలో సరస్వతి విగ్రహాం ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దేవత విగ్రహాం పగులగొట్టమే కాకుండా మద్యం పోశారనే వార్త వైరల్ అయ్యింది. దీంతో మతాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని పోలీసలు స్పందించారు. వాస్తవం తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయడం సరికాదని సూచించారు. ఫార్వార్డ్ చేసినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

statues were not destroyed sp vishal gunni

అయితే రాష్ట్రంలో రెండు విగ్రహాలను ధ్వంసం జరిగిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నరసరాపుపేటలో సరస్వతీ దేవి, ఆదోనిలో ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేశారని పోస్ట్ ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. అందుకే పోలీసులు స్పందించారు. నరసరావుపేట ఎల్‌ఐసీ కార్యాలయ సమీపంలో స్థలంలో సరస్వతీదేవి విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహం ధ్వంసమైన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో.. వెంటనే ఎస్పీ రియాక్టయ్యారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వార్త అవాస్తవం అని స్పష్టంచేశారు.

దేవుని విగ్రహాలు ధ్వంసం కావడం అనేది సున్నితమైన అంశం. దీంతో మత కల్లోలాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదివరకు చాలా ఘటనలు జరిగాయి. దీంతో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. వెంటనే గుంటూరు రూరల్ ఎస్పీ మీడయా ముందుకు వచ్చారు. అదీ ఫేర్ అని స్పష్టంచేశారు.

English summary
statues were not destroyed guntur rural sp vishal gunni said. someone are forward messages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X