• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లోకేష్ టార్గెట్ గా మంగళగిరి బరిలో తమన్నా ... బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే

|

మంగళగిరి రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి, సీఎం కుమారుడు నారా లోకేశ్ పోటీ చేస్తున్న ఈ స్థానాన్ని టీడీపీతోపాటు వైకాపా, జనసేనలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొదట పొత్తుకింద ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించిన జనసేన చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని తన అభ్యర్థిని బరిలోకి దింపింది. లోకేశ్‌ను ఓడించి తీరతానని సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇప్పటికే సవాల్ చేశారు.మరోవైపు.. ఎవరూ ఊహించని విధంగా ట్రాన్స్ జెండర్ తమన్నా బరిలోకి దిగుతున్నారు.

మంగళగిరి ఎన్నికల బరిలో తమన్నా .. ఇక అందరి చూపు మంగళగిరి వైపు

జనసేన నుండి టికెట్ ఆశించి భంగపడ్డ తమన్నా .. అనూహ్యంగా మంగళగిరి నుండి పోటీ

జనసేన నుండి టికెట్ ఆశించి భంగపడ్డ తమన్నా .. అనూహ్యంగా మంగళగిరి నుండి పోటీ

సోషల్ యాక్టివిస్ట్ గా ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి నారాలోకేష్ కు పోటీగా బరిలోకి దిగారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు. తమన్నా కొన్నాళ్లుగా మీడియా, యూట్యూబ్ చానళ్ల దర్వారా ట్రాన్స్‌జెండర్ల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. నటి శ్రీరెడ్డికి మొదట మద్దతిచ్చిన ఆమె తర్వాత ఆమెపై విమర్శలు కురిపించారు.మొన్నటి వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఫై అభిమానం కురిపించిన తమన్నా పవన్ విషయంలో చింతమనేని పై సవాల్ చేసారు. చింతమనేని పై పోటీ కి తానూ చాలంటూ అప్పట్లో సంచలనం సృష్టించారు.

ట్రాన్స్ జెండర్ లు ప్రతీ నియోజకవర్గం లో పోటీ చెయ్యాలన్న తమన్నా

ట్రాన్స్ జెండర్ లు ప్రతీ నియోజకవర్గం లో పోటీ చెయ్యాలన్న తమన్నా

ప్రజా సేవ చెయ్యాలనే సంకల్పంతో పోటీ చేయ్యాలని భావిస్తున్నట్లు తమన్నా సింహాద్రి చెప్పారు. జనసేన పార్టీ నాకు టిక్కెట్ ఇస్తుందని భావించానని, ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని, రాబోయే ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గం నుండి ట్రాన్స్‌జెండర్‌లు పోటీ చేయాలని ఆమె కోరారు. సవాళ్లు ప్రతిసవాళ్లతో ఎన్నికల కురుక్షేత్రంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల హీట్ పెరిగింది.

లోకేష్ టార్గెట్ గా తమన్నా ... లోకేష్ తమన్నా ధాటికి తడబడతారా

లోకేష్ టార్గెట్ గా తమన్నా ... లోకేష్ తమన్నా ధాటికి తడబడతారా

తమన్నా పోటీతో మంగళగిరిలో ఇంత కాలం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కి పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. ముఖ్యంగా నారా లోకేష్ టార్గెట్ గా తమన్నా బరిలోకి దిగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఓట్లను చీల్చే యత్నంలో భాగంగా తమన్నా బరిలోకి దిగుతున్నట్టు టాక్. తమన్నా వాగ్ధాటిని తట్టుకుని నారా లోకేష్ నిలబడతారా యధావిధిగా తడబదటారా అన్న చర్చ కూడా జరుగుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Mangalgiri constituency has become a hot topic in the election. Political developments are changing rapidly as CM Chandrababu's son Nara Lokesh contesting from there. From YCP Ramakrishna Reddy the sitting MLA is competing with Lokesh . And now Tamanna Simhadri, a trans gender, is also a nominee from Mangalgiri in the elections. As political analists says that Tamanna contesting in Mangalagiri targetting Lokesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more