గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

య‌ర‌ప‌తినేని ల‌క్ష్యంగా : కారు కింద 15 నాటు బాంబులు..

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లాలో బాంబులు క‌ల‌క‌లం సృష్టించాయి. గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు ఇంటికి స‌మీపం లో ఓ కారు కింద 15 నాటు బాంబుల‌ను బాంబ్ స్క్వాడ్ గుర్తించింది. దీని పై స్థానిక వైసిపి నేత‌ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. వైసిపి నేత అరెస్ట్ పై ఆ పార్టీ ఎమ్మెల్యే ఆందోళ‌న‌కు దిగారు..

గుంటూరు జిల్లా గుర‌జాల లో మ‌రోసారి బాంబులు క‌ల‌క‌లం సృష్టించాయి. గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస రావు ఇంటికి అత్యంత స‌మీపంలో ఓ కారు కింద 15 నాటు బాంబుల‌ను పోలీసులు గుర్తించారు. కారు య‌జ‌మాని..వైసిపి నేత య‌ర‌ప‌తినేని న‌ర‌సింహారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ల‌క్ష్యంగానే ఈ బాంబులు ఉంచారా అనే కోణం లో పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. రెంటచింతల మండలంలోని మంచికల్లు ఎమ్మెల్యే స్వగ్రామం. ప్రతి ఏడాది డిసెంబరు మాసంలో జరిగే గ్రామోత్సవానికి ఆయన కుటుంబసమేతంగా హాజరవుతారు. యథావిధిగా శనివారం గ్రామంలో జరిగే కోర్లపౌర్ణమి తిరునాళ్లకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యే యరపతినేని సిద్ధమయ్యారు. ఆ గ్రామం నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావటంతో పోలీసులు శుక్రవారం బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించా రు. అక్క‌డ బాంబులు దొర‌క‌టం పై ఎమ్మెల్యే యరపతినేని స్పందించారు. నాటు బాంబులు దొరికిన ఘటనపై లోతైన విచారణ చేపట్టాలి... వీటి వెనుక ఎవరున్నారనేది తేల్చాలి అని డిమాండ్ చేసారు.

Target Yarapathineni : Bombs detected in Gurazala

గతంలోనే ప్రయత్నాలు...

గుర‌జాల ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని పై గ‌తంలోనే హ‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగినట్లు అప్ప‌ట్లో పోలీసులు గుర్గించారు.
కొద్ది సంవత్సరాల క్రితం మాచర్ల నుంచి చివరి బస్సులో మంచికల్లు వస్తుండగా ప్రత్యర్థులు దారికాచారు. ముందే ఆ విషయాన్ని పసికట్టిన ఎమ్మెల్యే బస్సులో నుంచి మధ్యలోనే దిగిపోవటంతో ప్రమాదం తప్పింది. 2003 అక్టోబరు మాసంలో ఎమ్మెల్యే యరపతినేని లక్ష్యంగా నక్సల్స్‌ మందుపాతర అమర్చారు. ముందస్తు తనిఖీలతో పోలీసులు మందుపాతరను వెలికి తీయడంతో ప్రమాదం తప్పింది. ఇక‌, వైసిపి నేత‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌టంతో వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆ పార్టీ నేత‌లు ధ‌ర్నాకు దిగారు. ఈ వ్య‌వ‌హారంతో న‌ర‌సింహారావుకు సంబంధం లేద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

English summary
Bombs detected in Gurajala near local Mla yarapatineni House. Police suspected local ycp leader Narasimha Rao and taken him custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X