• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో ఇసుక మాఫియా దోచేస్తున్నారు .. సీఎం జగన్ పై నిప్పులు చెరుగుతున్న టీడీపీ

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని, మళ్లీ ఒకమారు ఇసుక కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు.ఇసుకని బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.ఇసుక అక్రమ దందా యధేచ్చగా సాగుతోందని విరుచుకుపడుతున్నారు.

ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా .. టీడీపీ నేతలకు అవంతి శ్రీనివాస్ సవాల్

 ఇసుక అక్రమాలపై వైసీపీ శాండ్‌ మాఫియా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్

ఇసుక అక్రమాలపై వైసీపీ శాండ్‌ మాఫియా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్

రాష్ట్రంలోని ఇసుక అక్రమాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు.ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన నారా లోకేష్ ఇసుక మాయం అవుతోందన్నారు. 70 మంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకొన్నతరువాత కూడా వైఎస్‌ జగన్‌ ఇసుక దాహం తగ్గలేదని విమర్శలు గుప్పించారు. వైసీపీ శాండ్‌ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. ఇసుక దొరక్కుండా చేసి అడ్డదారిలో రేట్లు పెంచి అమ్ముకుంటూ ప్రజలను కొల్లగొడుతున్నారని లోకేష్ ఆరోపించారు. ఇక ఏకంగా స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేనే బొచ్చెడు ఇసుక కూడా గ్రామాల్లో ఇవ్వలేకపోతున్నామని గోడు వెళ్లగక్కారంటే వైసీపీ శాండ్‌ మాఫియా అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం అవుతోంది అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

ఏపీలో దొంగలు పడ్డారన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఏపీలో దొంగలు పడ్డారన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఇక రానున్నవర్షాకాలం నేపథ్యంలో ఇసుకకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఉండేలా ఇసుక తవ్వకాలు జరిపి స్టాక్ పాయింట్ లకు తరలించాలని ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ కొనసాగించే ఉన్న సమయంలో కూడా ఇసుక తరలింపు ప్రక్రియ చేపట్టింది. ఇక ఈ సమయంలో టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీలో దొంగలుపడి రాష్ట్రాన్ని దోచేస్తున్నారు అని విమర్శలు గుప్పించారు. ఇక ఇసుక కావాలంటే బ్లాక్ లో మాత్రమే జరుగుతుందని ప్రజల అవసరాలకు ఇసుక దొరకడం లేదని ఆయన నిప్పులు చెరిగారు.

ఇక ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకోమని చెబుతూనే ఆన్లైన్ ఓపెన్ అయిన ఐదు నిమిషాల్లోనే క్లోజ్ అయింది అంటున్నారని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది అని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.

నేతిబీరకాయలో నెయ్యి ఎంతుందో జగన్ మాటల్లో నీతి అంతే అన్న గోరంట్ల

నేతిబీరకాయలో నెయ్యి ఎంతుందో జగన్ మాటల్లో నీతి అంతే అన్న గోరంట్ల

రీచ్ లనుండి ఇసుక 50శాతం స్టాక్ పాయింట్ లకు వెళుతోందని మిగతా ఇసుకంతా బ్లాక్ లో అమ్ముడు పోతోందని ఆయన పేర్కొన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అవినీతి అక్రమాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో కూడా అంటే నీతి ఉంటుందని ఆయన మండిపడ్డారు. మైనింగ్ మాఫియా రాష్ట్రాన్ని శాసిస్తోందని, గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా జెసిబి లతో అడ్డంగా తవ్వేస్తున్నారు అని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఇక వైసీపీ అవినీతి పరాకాష్టకు చేరిన బుచ్చయ్య టాప్ టు బోటమ్ అంతా అవినీతి మయం అని పేర్కొన్నారు.

 లక్షలాది టన్నుల ఇసుక దోపిడీపై సమాధానం చెప్పాలి : దేవినేని ఉమా

లక్షలాది టన్నుల ఇసుక దోపిడీపై సమాధానం చెప్పాలి : దేవినేని ఉమా

ఇక ఇసుక మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేవినేని ఉమా అమరావతి నుండి బయలుదేరిన ఇసుక లారీలు స్టాక్ పాయింట్ చేరకుండా మధ్యలోనే మాయమవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతోందని,లక్షలాది టన్నుల ఇసుక దోపిడీపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.ట్విట్టర్ వేదికగా ఇసుక దోపిడీపై మాట్లాడిన దేవినేని ఉమా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరించి లక్షలాది టన్నుల ఇసుకను దోపిడీ చేస్తున్నారు, దీనిపై సమాధానం చెప్పండి జగన్ గారు అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.

  Pawan Kalyan Slams AP Govt Over Sand Mafia In West Godavari
  పంచభూతాలను కూడా మింగేస్తున్నారన్న బోండా ఉమా

  పంచభూతాలను కూడా మింగేస్తున్నారన్న బోండా ఉమా

  ఇక ఇసుక దోపిడీ పై టిడిపి నేత బోండా ఉమ కూడా నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు అండతోనే ఇసుక దందా సాగుతోందని ఆయన విమర్శించారు. పంచభూతాలను కూడా మింగేసే విధంగా జగన్ పాలన కొనసాగుతోందని నిప్పులు చెరిగారు. తాడేపల్లి కేంద్రంగా విచ్చలవిడిగా అక్రమ ఇసుక దందా సాగుతోందని మండిపడిన బోండా ఉమ లక్షల టన్నుల ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి భూమి, నీళ్లు ఇసుక దేన్ని వదలడం లేదని విమర్శలు గుప్పించారు.

  English summary
  Leaders of Telugu Desam Party have outraged over the YCP government that the sand mafia is erupting in Andhra Pradesh and that there is a risk of a shortage of sand once again. The sand is being illegally transported to other states .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more