గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Nara Lokesh: అక్కచెల్లెమ్మలపై మీ ప్రతాపమా? గొంతునొక్కి ఈడ్చుకెళ్తారా?: నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాష్ట్రంలోొ మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ గురువారం రాజధాని అమరావతి ప్రాంతంలో సకల జనుల సమ్మెలో పాల్గొన్న మహిళలను పోలీసులు అరెస్టు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కచెల్లెమ్మలు అంటూ ఎన్నికల ప్రచార సమయంలో వారిని సంబోధించిన జగన్.. వారిపైనే పోలీసు జులుం ప్రదర్శించేలా చేశారని విమర్శించారు.

Amaravati: రైతు చేతిపైకి పోలీసు జీప్: మందడంలో మహిళల అరెస్టు.. ఉద్రిక్తత!Amaravati: రైతు చేతిపైకి పోలీసు జీప్: మందడంలో మహిళల అరెస్టు.. ఉద్రిక్తత!

సకల జనుల సమ్మెను భగ్నం చేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలతో మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మందడంలో 17 రోజులుగా మహిళలు వివిధ రూపాల్లో నిరసనలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొని, వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా, వారు ప్రతిఘటించారు. ఫలితంగా- తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

 TDP General Secretary Nara Lokesh criticized with strong words to Chief Minister YS Jagan

ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ నారా లోకేష్ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు, వారి కుటుంబీకులు, మహిళలు 16 రోజులుగా నిద్రాహారాలు మాని ఆందోళనలు కొనసాగిస్తున్నారని అన్నారు. వారితో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలను విరమింపజేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని, అమరావతిలోనే కొనసాగించేలా ఆ ప్రకటన ఉండాలని చెప్పారు.

శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలపై జగన్ ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపించడం దారుణమని విమర్శించారు. అక్క చెల్లెమ్మలపై ప్రతాపాన్ని చూపించడం దారుణం జగన్ గారూ.. అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అమరావతిలో పోలీసులు మహిళల గొంతు నొక్కి ఈడ్చుకెళ్లిన ఘటన జగన్ గారి నిరంకుశత్వ పాలనకు నిదర్శనమని ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, మడమ తిప్ప కూడదంటూ మహిళలు అడగటమే తప్పా? అని నిలదీశారు. అంటూ నిలదీశారు. లాఠీలతో ఉద్యమాలను అణచివేయాలనుకున్న నియంతలు ఎక్కడ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

English summary
Telugu Desam Party National General Secretary and Ex Minister Nara Lokesh criticized with strong words to Chief Minister YS Jagan. Police arrested Women farmers who participated in protest against YS Jagan's decision on three capital cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X