• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీలో కులాలపై కొత్త చట్టం.. సీఎం జగన్ కంపెనీల్లో డబ్బులు వాళ్లవే..

|

''చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో151 సీట్ల బ్రహ్మాండమైన మెజార్టీతో వైసీపీ గెలిచింది. ఇప్పటికే మూడు రాజధానుల, మండలిరద్దు లాంటి అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మిగిలిందల్లా ఏపీలో కులాలకు సంబందించి కొత్త చట్టాన్ని రూపొందించడమే. రాష్ట్రంలో ఏ కులాలు ఏం చేయాలి? ఏ కులస్తులు ఏయే పదవులు చేపట్టాలి? ఫలానా కులం వాళ్లు తప్ప మిగతా కులాలతో పనిలేదనే తీర్మానాలు చేయాలి. పనిలోపనిగా సీఎం జగన్ ఎదుగుదలకు కారణమైన కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో డబ్బులు కుమ్మరించింది ఏ కులం వాళ్లో వెల్లడికావాల్సిందే''అని ఫైరయ్యారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర.

రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ.. జగన్ పదేపదే కులాలను ప్రస్తావించడం, ఎన్నికల కమిషనర్ కు కులాన్ని ఆపాదించడం దారుణమని, తన కంపెనీల్లో పెట్టుబడులు, రాజకీయ క్రీడలకు అడ్డురాని కులం.. ఇప్పుడు మాత్రమే సీఎంకు ఎందుకు గుర్తొస్తున్నదో అర్థం కావడంలేదని టీడీపీ నేత మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో బీజేపీ పొత్తుపైనా సంచలన ఆరోపణలు చేశారు. నరేంద్ర ఏమన్నారంటే...

కొత్త చట్టం ఎలా ఉంటుందంటే..

కొత్త చట్టం ఎలా ఉంటుందంటే..

‘‘గవర్నర్ అపాయింట్ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడినంత దారుణంగా దేశంలో ఇప్పటిదాకా ఏ సీఎం కూడా మాట్లాడలేదు. మనుషుల ముఖాల మీదే కులం పేరు రాసున్నట్లు.. సీఎం నోరు తెరిస్తే కులం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దీనికి ఇంత ప్రయాస అవసరం లేదు.. సింపుల్ గా రాష్ట్రంలో ఫలానా కులాలు వాళ్లే ఉండాలి, మిగతావాళ్లు ఉండొద్దని చెబుతూ ఒక కుల చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేస్తే సరిపోతుంది. ఎలాగూ 151 మంది ఎమ్మెల్యేలున్నారు కాబట్టి ఆ చట్టం ఈజీగా పాస్ అవుంది. ఇంతగా కులాలను పట్టించుకునే జగన్.. ప్రాక్టికల్ గా ఏం చేశాడో చూస్తే అందరూ షాకవ్వాల్సిందే..

ఇదీ కులాల జాబితా..

ఇదీ కులాల జాబితా..

జగన్ కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ ఏ కులస్తుడు? జగన్ వ్యాపార లావాదేవీల్లో కీలక పాత్రపోషించే కోనేరు ప్రసాద్ కమ్మవాడు కాదా? వైసీపీ పెట్టుబడిదారుల్లో ఒకరు, విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేసిన పీవీపీ ప్రసాద్‌ సామాజికవర్గం ఏది? పరమ అపవిత్రమైన వికృత రాజకీయ క్రీడలో భాగంగా మీరు వాటేసుకున్న వల్లభనేని వంశీది ఏ కులం? నిన్నగాకమొన్న కండువాలు కప్పిన కరణం బలరాం కులమేది? అంటే.. మీ వ్యాపారాలు బాగుండటానికి, పెట్టుబడులు పెట్టడానికి, రాజకీయ క్రీడలకు కులాలతో పనిలేదు. సరిగ్గా రాజ్యాంగ నిబంధనల దగ్గరికొచ్చేసరికి కులం కార్డును బయటికి తీయడం వికృత క్రీడకాక మరేంటి?

సీఎం అయితే ఏంటట?

సీఎం అయితే ఏంటట?

151 సీట్లు ఇచ్చినంత మాత్రాన రాష్ట్రాన్ని రాసిచ్చినట్లు కాదు.. జగన ను జనం ఎన్నుకుంది సుపరిపాలన కోసమే కానీ దోపిడీలు, దౌర్జన్యాలు చేయమని కాదు. అయినా, ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ చేసిన తప్పేంటి? స్థానిక ఎన్నికల్లో పట్టపగలు అధికార పార్టీ దారుణాలకు తెగబడుతోంటే అడ్డుచెప్పడమే ఆయన పొరపాటా? సహేతుక కారణాలు చెప్పి ఎన్నికల్ని వాయిదా వేస్తే... దానికి ‘సీఎం ఆయనా? నేనా?'అని జగన్ పోల్చుకోవడం అవసరమా? గతంలో ఇదే వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల కమిషనర్ మొదలు ఎస్ఐల దాకా ఎన్నెన్నో బదిలీలు జరిగాయి. ఆనాడు చంద్రబాబు ఇలా మాట్లాడలేదే, చొక్కాలు చించుకున్న ఎల్వీ సుబ్రమణ్యం లాంటివాళ్లను జగన్ తంతే ఇప్పుడెక్కడ పోయి పడ్డారు? సీఎం అయితే ఏదైనా చేసేస్తారా?

స్పీకర్ కాదు వీధి కుక్క..

స్పీకర్ కాదు వీధి కుక్క..

జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రమంతటా వీధి కుక్కల్ని పెంచిపోషిస్తున్నాడు. పైన బొత్సా సత్యనారాయణ మొదలు కింద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదాకా.. వీళ్లకేమీ పనుండదు. జగన్ ఉస్కో అనగానే అవతలివాళ్లమీదపడి కరవడమే ఈ కుక్కల పని. ఆ గుంపులోనే తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయనొక స్పీకరా? రాజ్యాంగ పదవిలో ఉంటూ.. ఎన్నికల కమిషనర్ ను నిందిచొచ్చా? వైసీపీ శ్రేణులు నడిరోడ్డుమీద ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే నోరు మెదపని సీఎం జగన్.. ఎన్నికల వాయిదాపై స్పందిస్తూ ధర్మం, వేదం గురించి వల్లెవేయడం చాలా కామెడీగా ఉంది.

  5 Minutes 10 Headlines || Coronavirus Updates || Madhya Pradesh Floor Test || Modi On COVID-19
  బీజేపీ పెంచిన పాము..

  బీజేపీ పెంచిన పాము..


  జనసే, బీజేపీ ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. బేసిగ్గా పాములాంటివాడైన జగన్ ఇవాళ బుసలు కొడుతున్నాడంటే.. బీజేపీనే కారణం. పాలు పోసి పెంచిన బీజేపీపైనే ఆ పాము విషం చిమ్ముతున్నది. తిరుపతిలో నామినేషన్ వేసిందన్న అక్కసుతో బీజేపీ మహిళ చేతిని వైసీపీ వాళ్లు తెగనరికారు. దిశా చట్టం దేవుడెరుగు, స్థానిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వికృతకాండ సాగింది. వీటిపై స్పందించినందుకే ఎస్ఈసీ రమేశ్ కుమార్ దుర్మార్గుడయ్యాడు''అని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.

  English summary
  while speaking with media at tdp central office on monday, tdp leader dhulipalla narendra slams cm jagan over local body elections. he said, being in constitutional posts, cm and speaker sitaram should not make caste comments on election commissioner
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X