గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి అభ్య‌ర్ది పై పోటీ దారుడి భౌతిక దాడి ..ముఖ్య‌మంత్రి ఇంటి వ‌ద్ద హ‌ల్‌చ‌ల్‌..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి ఇంటి వ‌ద్ద టిడిపి కార్య‌క‌ర్త‌లు హ‌ల్‌చ‌ల్ చేసారు. న‌ర్స‌రావు పేట పార్ల‌మెంట్ పరిధిలోని మాచ‌ర్ల నియోజ కవ‌ర్గం చ‌ల‌మా రెడ్డికి కేటాయించాని కోరుతూ ఆయ‌న అనుచ‌రులు ఆందోళ‌నకు దిగారు. అక్క‌డ టిడిపి అభ్య‌ర్దిగా అం జి రెడ్డిని ప్ర‌క‌టించారు. అయితే, ఆందోళ‌న కు ఫ‌లితం లేక‌పోవ‌టంతో..అభ్య‌ర్ది అంజిరెడ్డి పై చ‌లమా రెడ్డి చేయి చేసు కున్నారు. ఇది ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది.

టీడిపి స్టార్ క్యాంపెయిన్ ఆయ‌నే..! ఏపిలో పార్టీని ప‌రుగులు టీడిపి స్టార్ క్యాంపెయిన్ ఆయ‌నే..! ఏపిలో పార్టీని ప‌రుగులు

మాచ‌ర్ల పంచాయితీ..
టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసిపోయి, నామినేషన్ల ప్రక్రియా మొదలైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు తల నొప్పులు తగ్గడం లేదు. అసమ్మతి నేతల అనుయాయులు, పార్టీ కార్యకర్తలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకు పోరాడైనా తమకు నచ్చని అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని పట్టుదలగా ఉన్నారు. మాచర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న అన్నపురెడ్డి అంజిరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం నిరసనకు దిగింది. సీఎం చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ శ్రేణులు వ‌రుస‌గా రెండోరోజు ఆందోళనకు దిగాయి. అంజిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వొద్దని కార్యకర్తలు హెచ్చరించారు. తమ నిరసనలను లెక్కచేయకుండా ఆయన నామినేషన్‌ వేస్తే అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన కొమ్మారెడ్డి చలమారెడ్డినే సీటు వరిస్తుందని అందరూ భావించామ‌ని..అయితే, అంజిరెడ్డి కి సీటు కేటాయించారు.

TDP leader HalChal aT Cms house : man handling on tdp candidate

చేయి చేసుకున్న నేత‌..
ముఖ్య‌మంత్రి ఇంటి వ‌ద్ద ఆందోళ‌న చేస్తున్న చ‌ల‌మా రెడ్డి మ‌ద్ద‌తు దారుల‌ను స‌ముదాయించేందుకు టిడిపి నేత‌లు రంగంలోకి దిగారు. అధికారంలోకి వ‌స్తే చ‌ల‌మారెడ్డికి త‌గిన ప్రాధాన్య‌త ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. న‌ర్స‌రావుపేట ఎంపి అభ్య‌ర్ది రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, మాచ‌ర్ల అభ్య‌ర్ది అంజిరెడ్డి ని సైతం సీయం నివాసానికి పిలిపించారు. వారి స‌మ‌క్షం లోనే చ‌ల‌మారెడ్డిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసారు. అయితే, అక్క‌డి నుండి ముఖ్య‌మంత్రి వెళ్లిపోగానే...సీటు ఆశిస్తు న్న చ‌ల‌మారెడ్డి రెచ్చిపోయారు. అభ్య‌ర్దిగా ఖ‌రారైన అంజిరెడ్డి పై చేయి చేసుకున్నారు. దీంతో..అక్క‌డ ఉన్న నేత‌లు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న తో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ పోరు తీవ్ర స్థాయికి చేరింది. మాచ‌ర్ల లో టిడిపి అభ్య‌ర్దిని..న‌ర్స‌రావుపేట ఎంపి అభ్య‌ర్ది రాయ‌పాటిని ఎలాగైనా ఓడిస్తామ‌ని చ‌ల‌మారెడ్డి వ‌ర్గం ప్ర‌క‌టించింది.

English summary
Guntur dist macharla TDP Group politics became serious. One of the seat aspirant Chalama reddy followers protest dharna at Cm Camp office. There Chalamareddy man handled on announced candidate Anji reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X