గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అదో పెద్ద కుంభకోణమే, జే ట్యాక్స్, జగన్ డీఎన్ఏలోనే అవినీతి: లోకేష్ తీర్మానం

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మద్యం ద్వారా రూ. కోట్ల జే ట్యాక్స్ రాబట్టారని.. అవినీతి అనేది జగన్ డీఎన్ఏలోనే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Mahanadu: నారా లోకేష్ 2.0: ఏం చేశారండీ..ఇంత తగ్గారు!Mahanadu: నారా లోకేష్ 2.0: ఏం చేశారండీ..ఇంత తగ్గారు!

అదో పెద్ద కుంభకోణం..

అదో పెద్ద కుంభకోణం..


మహానాడు రెండో రోజులో భాగంగా ఆయన నేతలతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో అనేక కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్పారు. ఎన్నో ఇబ్బందులు పడి హెచ్‌సీఎల్ సంస్థను తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ఉపాధి లేక యువత అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యుత్ ధరల పెంపు వెనుక పెద్ద కుంభకోణమే ఉందన్నారు. యూనిట్ విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

జే ట్యాక్స్ పేరుతో వసూళ్లు.. విశాఖలో భూదందా

జే ట్యాక్స్ పేరుతో వసూళ్లు.. విశాఖలో భూదందా

వైసీపీ పాలనలో కబ్జాలు పెద్ద ఎత్తున పెరిగాయని లోకేశ్ ధ్వజమెత్తారు. జే ట్యాక్స్ పేరుతో మహానాడులో లోకేష్ తీర్మానం ప్రవేశపెట్టగా.. ఎమ్మెల్యే దీపక్ రెడ్డి దాన్ని బలపరిచారు. మద్యం ద్వారా రూ. కోట్ల మేర జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. జే గ్యాంగ్ రాష్ట్ర వ్యాప్తంగా భూములన్నీ కొట్టేస్తోందని లోకేష్ ఆరోపించారు. విశాఖలోని విలువైన భూములు రూ. 1000 కోట్లు విలువైన వాల్దేరు భూములు.. దసపల్లా భూములను కబ్జా చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖలో ఏకంగా 500 భూ కబ్జా కేసులు నమోదయ్యాయని తెలిపారు.

Recommended Video

TDP Digital Mahanadu 2020 : Digital Meetings Instead of Public Meetings in Future
పేదల భూములు.. జగన్ అనుచరులకు.. ఆయన డీఎన్ఏలోనే..

పేదల భూములు.. జగన్ అనుచరులకు.. ఆయన డీఎన్ఏలోనే..

రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భూములు లాక్కుంటున్నారని, ప్రభుత్వ భూములన్నీ జగన్ తన అనుచరులకు ఇప్పించే కుట్ర చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. శ్రీవారి ఆస్తులు కూడా అమ్మకానికి పెట్టారంటే జగన్ ధన దాహానికి పరాకాష్ట అని ఘాటుగా వ్యాఖ్యానించారు. బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని సోల్డ్ ఏపీగా మార్చారని లోకేష్ ఆరోపించారు. కరోనా కిట్లు, బ్లీచింగ్ పౌడర్, భూ కొనుగోళ్లు.. ఇలా ఎక్కడా చూసినా అవినీతేనని అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తెచ్చేందుకు కృషి చేస్తే.. జగన్ వచ్చాక కొత్త మద్యం బ్రాండ్లు తప్ప ఏం లేదన్నారు.

English summary
TDP leader nara lokesh hits out at ap cm jagan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X