గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి అరెస్ట్ వారెంట్? నోటి దురుసు ఫలితమేనా?

|
Google Oneindia TeluguNews

గుంటూరు: తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉప నేత, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు వారెంట్ ను జారీ చేసినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఈ నెల 11వ తేదీన నిర్వహించిన ఛలో ఆత్మకూరు ఆందోళన సందర్భంగా అచ్చెన్నాయుడు విధి నిర్వహణలో ఉన్న జిల్లా ఎస్పీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ఆయనపై రాజధాని ప్రాంతంలోని తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు చెబుతున్నారు. ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని అంటున్నారు. కాగా.. అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు జిల్లాలో వినిపిస్తున్నాయి.

ఇకపై అక్కడ హైదరాబాద్ అనే పేరు వినిపించదు!ఇకపై అక్కడ హైదరాబాద్ అనే పేరు వినిపించదు!

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఛలో ఆత్మకూరు ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

TDP MLA Atchannaidu booked for attacking on duty police at Chalo Palnadu agitation

ఈ విషయం తెలుసుకున్న అచ్చెన్నాయుడు తన అనుచరులతో కలిసి చంద్రబాబు ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. తనను అడ్డగించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ని యూజ్ లెస్ ఫెలో అంటూ దూషించారు. ఈ ఘటన నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.

English summary
Telugu Desam Party law maker and Deputy floor leader Kinjarapu Atchannaidu likely to be arrest in row of Chalo Athmakur agitation organized by the Party. Atchannaidu attack a district Police Superintendent and Sub Inspector at that movement. Police registered a case against in Thadepalli Police Station, source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X