గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీకి మ‌రో షాక్‌! ఎమ్మెల్సీ ప‌ద‌వికి.. పార్టీకి అన్నం స‌తీష్ రాజీనామా: ఆయ‌న బాట‌లోనే ..!

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్‌. పార్టీకి ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ రాజీనామా చేసారు. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న బాప‌ట్ల నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్ది కోన ర‌ఘుప‌తి చేతిలో ఓడిపోయారు. అప్ప‌టి నుండి ఆయ‌న పార్టీలో అంత యాక్టివ్‌గా ఉండ‌టం లేదు. తాజాగా ఆయ‌నకు అత్యంత స‌న్నిహితంగా ఉండే రాజ్య‌స‌భ స‌భ్యు డు సుజ‌నా చౌద‌రి బీజేపీలో చేర‌టంతో అప్ప‌టి నుండి స‌తీష్ సైతం వెళ్తార‌నే ప్ర‌చారం సాగింది. ఈ రోజు స‌తీష్ త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వితో పాటుగా టీడీపీకి రాజీనామా చేసారు. అయితే, మరి కొంత మంది ఎమ్మెల్సీలు ఆయ‌న బాట‌లో నే ఉన్నార‌నే ప్ర‌చారం టీడీపీలో జోరుగా సాగుతోంది.

టీడీపీకి ఎమ్మెల్సీ రాజీనామా..

టీడీపీకి ఎమ్మెల్సీ రాజీనామా..

టీడీపీకి మ‌రో నేత రాజీనామా చేసారు. టీడీపీ వాయిస్ బ‌లంగా వినిపించే అన్నం స‌తీష్ ప్ర‌భాక‌ర్ ఎమ్మెల్సీ ప‌ద‌వికి ..అదే విధంగా టీడీపీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసారు. శాస‌న‌మండ‌లి కార్య‌ద‌ర్శికి స‌తీష్ త‌న రాజీనామా లేఖ‌ను పంపారు. 2014..2019 ఎన్నిక‌ల్లో స‌తీష్ ప్ర‌భాక‌ర్ టీడీపీ అభ్య‌ర్దిగా బాప‌ట్ల నుండి పోటీ చేసారు. రెండు సార్లు వైసీపీ అభ్య‌ర్ది..ప్ర‌స్తుత డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో స‌తీష్‌కు టిక్కెట్ ఇవ్వ‌ద్ద‌ని నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు చంద్ర‌బాబు మీద ఒత్తిడి తెచ్చారు. కానీ, వారికి చంద్ర‌బాబు న‌చ్చ‌చెప్పారు. చివ‌ర‌కు
ఆయ‌న‌కు టిక్కెట్ ద‌క్కింది. అయినా ఓడిపోయారు. అప్ప‌టి నుండి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు స‌తీష్ దూరంగానే ఉంటు న్నారు. కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రికి స‌న్నిహితుడుగా ఉంటున్నారు. దీంతో..ఆయ‌న బీజేపీలోకి చేర‌టంతో స‌తీష్ సైతం ఆయ‌న మార్గాన్నే అనుస‌రించే అవ‌కాశం క‌నిపిస్తోంది.

స‌తీష్‌తో పాటుగా మ‌రికొంద‌రు..

స‌తీష్‌తో పాటుగా మ‌రికొంద‌రు..

శాస‌న మండ‌లి స‌భ్యుల్లో ప్ర‌స్తుతం అన్నం స‌తీష్ టీడీపీని వీడ‌టంతో ఆయ‌న బాట‌లోనే మరి కొంద‌రు ఎమ్మెల్సీలు ఉన్నార‌నే ప్ర‌చారం టీడీపీలో జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాల‌యం లో ఉన్న స‌మ‌యంలోనే అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పార్టీని వీడారు. స‌తీష్‌తో పాటుగా మ‌రి కొందరు ఇత‌ర పార్టీల నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం వినిపిస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన మ‌రో ఎమ్మెల్సీ పేరు సైతం పార్టీలో వినిపిస్తోంది. 2009 ఎన్నిక‌ల్లో ఓడినా స‌తీష్‌కు బాప‌ట్ల ఇన్‌ఛార్జ్ ప‌ద‌వి ఇవ్వ‌టంతో పాటుగా ఎమ్మెల్సీ ప‌ద‌వి సైతం క‌ట్ట బెట్టారు. తిరిగి 2019 ఎన్నిక‌ల్లోనూ టిక్కెట్ ఇచ్చారు. పార్టీ ఇంత‌గా ప్రాధాన్య‌త ఇచ్చినా స‌తీష్ పార్టీ వీడ‌టం పైన పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, పార్టీ వీడే అంశాన్ని స‌తీష్ ఎవ‌రితోనూ చ‌ర్చించ‌లేద‌ని.. ఆయ‌న‌కు సుజ‌నా చౌద‌రితో ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగానే పార్టీ వీడార‌ని టీడీపీ నేత‌లే చెబుతున్నారు.

ఎమ్మెల్యేలు అనుకుంటే..ఎమ్మెల్సీలు ఇలా..

ఎమ్మెల్యేలు అనుకుంటే..ఎమ్మెల్సీలు ఇలా..

తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిన నాటి నుండి అనేక మంది నేత‌లు వైసీపీతో..బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం సాగు తోంది. టీడీపీ నుండి ప్ర‌స్తుతం ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో 18 మంది బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని ఆ పార్టీ నేత‌లు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే స‌డ‌న్‌గా ఎమ్మెల్సీలు సైతం బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నార‌నే స‌మాచారం ఇప్పుడు టీడీపీలో క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తోంది. శాస‌న‌స‌భ‌లో వైసీపీ స‌భ్యుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్నా..శాస‌న మండ‌లి లో మాత్రం టీడీపీ సంఖ్యా బ‌లం ఎక్కువ‌. దీంతో..ఇప్పుడు వ్యూహాత్మ‌కంగా ఎమ్మెల్సీల పైనే దృష్టి సారించి న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే గుంటూరు జిల్లా నుండి సీనియ‌ర్ నేత చందు సాంబ‌శివ‌రావు ఈ నెల‌14న బీజేపీ లో చేరటానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఇప్పుడు స‌తీష్ రాజీనామా చేసారు. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఎంత‌మంది బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.

English summary
TDP MLC Annam Satish Prabhakar resigned for his MLC and membership for TDP. Satish may join in BJP shortly. He was close associate of Ex minister Sujana Chowdary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X