• search
 • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రమాణస్వీకారం రోజు జగన్ ఖర్చు 43 లక్షలు, కార్యక్రమానికి 59 లక్షలు- సంభ్రమాశ్చర్యంతో లోకేష్ ట్వీట్లు

|

గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చాక మే 30వ తేదీన విజయవాడలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అయిన ఖర్చును వివిధ ప్రభుత్వశాఖలకు చెల్లిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పేర్కొన్న వివరాలు విపక్షాలకు ఆయుధంగా మారాయి. ముఖ్యంగా ఆ రోజు సీఎం జగన్ కోసం అధికారులు వ్యక్తిగతంగా పెట్టిన ఖర్చు, కార్యక్రమ నిర్వహణకు అయిన ఖర్చుకూ మధ్య భారీ వ్యత్యాసం కూడా లేకపోవడంతో విపక్ష టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ టార్గెట్ గా ట్వీట్లు పెట్టారు.

జగన్ ప్రమాణ స్వీకారం...

జగన్ ప్రమాణ స్వీకారం...

గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చి సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హంగూ ఆర్బాటాలకు పోకుండా అతి తక్కువ ఖర్చుపెట్టినట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా సీఎం జగన్ కోసం అధికారులు పెట్టిన ఖర్చు రూ. 43.99 లక్షలు. ఇందులో సీఎంకు వాటర్ బాటిల్స్, తాత్కాలిక టాయిలెట్లు, వీఐపీ సోఫాలు, టీ షర్ట్ లు, కుర్చీలు, బటర్ మిల్క్ కోసం ఈ మొత్తం ఖర్చు చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలకు రీఇంబర్స్ మెంట్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఇవాళ ట్వీట్లు చేశారు.

ప్రజల సొమ్ము సీఎం నీటి పాలు...

ప్రజల సొమ్ము సీఎం నీటి పాలు...

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం రోజే జగన్ వృథా ఖర్చుకు తెరలేపారంటూ లోకేష్ ఇవాళ ట్వీట్లు చేశారు. ఇందులో ప్రభుత్వం తాజాగా ఈ ఖర్చును ప్రభుత్వశాఖలకు చెల్లించేందుకు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను కూడా ట్వీట్ కు ఆయన జోడించారు. డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు చేశారంటే ఇదేనంటూ లోకేష్ ట్వీట్ లో జగన్ పై ఆరోపణలు చేశారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అని, ప్రజల సొమ్ము సీఎం నీళ్లపాలు అంటూ పేర్కొన్నారు. సీఎం ఒక మీటింగ్ లో తాగిన వాటర్ బాటిల్స్, బటర్ మిల్స్ ఖర్చు రూ.43 లక్షలా అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఒక్క రోజులో ఇంత తాగారంటే అది అమృతమైనా అయి ఉండాలి లేదైనా స్కామ్ అయినా చేసుండాలంటూ లోకేష్ విమర్శలు సంధించారు.

ప్రమాణస్వీకారానికి రూ. 59 లక్షలు..

ప్రమాణస్వీకారానికి రూ. 59 లక్షలు..

జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన వారికి స్నాక్స్, వాటర్ బాటిల్స్, వీఐపీ సోఫాలు, టీ షర్ట్ లు, ఎల్ఈడీ స్క్లీన్స్, సీసీ కెమెరాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, అతిధుల వసతి, రవాణా కోసం మరో రూ.59.49 లక్షలు ఖర్చయినట్లు ప్రభుత్వ శాఖలు క్లెయిమ్ చేశాయి. వీటి చెల్లింపుకి కూడా అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపైనా నారా లోకేష్ ట్వీట్లలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిన్నవి స్నాక్సా, కరెన్సీ నోట్లా జగన్ గారూ అంటూ మరో ట్వీట్ లో లోకేష్ ప్రశ్నలు సంధించారు. అయితే ఈ వ్యవహారానికి జగన్ వ్యక్తిగత ఖర్చుకూ సంబంధం లేదని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను బట్టి తెలుస్తోంది.

  Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu
  లోకేష్ బోల్తా పడ్డారా ?

  లోకేష్ బోల్తా పడ్డారా ?

  అప్పట్లో సీఎం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి దాదాపు కోటి రూపాయల ఖర్చు మాత్రమే పెట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. తాజాగా విడుదల చేసిన లెక్కల ఆధారంగా చూసినా ఖర్చు రూ.కోటీ నాలుగు లక్షలు మాత్రమే అయినట్లు చూపింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి కోటి రూపాయల ఖర్చు పెట్టడం కూడా తప్పే అన్నట్లుగా లోకేష్ చేసిన ట్వీట్లు చూస్తుంటే ఆయన అమాయకత్వానికి నిదర్శనమని వైసీపీ నేతలు నవ్వుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 2014లో పెట్టిన ఖర్చు కోట్లలోనే ఉందని, కానీ కోటి రూపాయల ఖర్చు మాత్రమే చేసినా స్నాక్స్ ను మాత్రమే ప్రస్తావిస్తూ లోకేష్ ట్వీట్లు చేయడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు.

  English summary
  tdp mlc nara lokesh targetting ap govt for spending rs.43 lakhs for cm jagan and another 59 lakshs for his oath ceremony last year. lokesh surprises that how can this much of huge amount spent for a person in a day for his snacks and others.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X