గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. ఏం లాభం: కరోనాను అడ్డుకోలేకపోయారు: జగన్‌పై వర్ల రామయ్య నిప్పులు

|
Google Oneindia TeluguNews

గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య మరోసారి ఉగ్రరూపాన్ని దాల్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నియంత్రించడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు చైతన్యపరచాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ.. ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

మోడీని మించిపోయారా?

మోడీని మించిపోయారా?

శనివారం మధ్యాహ్నం ఆయన గుంటూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. కరోనాను అడ్డుకోలేకపోయిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంతటి స్థాయి వ్యక్తి జనం ముందుకు వచ్చారని, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇప్పటికే రెండు మూడుసార్లు విలేకరుల సమావేశాన్ని పెట్టి ప్రజలకు జాగ్రత్తలు చెప్పారని చెప్పారు.

మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయం..

మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయం..

151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తాను ఏం చెప్పినా దానికి వంతపాడే సొంత మీడియా సంస్థ ఉన్నప్పటికీ.. ప్రజలకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడానికి ఎందుకు ముందుకు రావట్లేదని నిలదీశారు. న్యూస్ ఛానళ్లకు రెండు, మూడు కోట్ల ధారపోసి, ప్రచారం చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. దేశం మొత్తం కరోనా వైరస్ వల్ల భయాందోళనలకు గురవుతుంటే వైఎస్ జగన్ అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్

పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్


కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పారాసిటమాల్ మాత్రను వాడాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లి దాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని చెప్పడం బాధ్యతారాహిత్యమని వర్ల రామయ్య ఆరోపించారు. పనికిరాని పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్‌ను పక్కన పెట్టాలని హితవు పలికారు. మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నివారణ చర్యలను పాటిస్తున్నాయో వాటినే అనుసరించాలని డిమాండ్ చేశారు.

నేర చరిత్రులను రాజ్యసభకు

నేర చరిత్రులను రాజ్యసభకు

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరచరిత్ర గల వారిని రాజ్యసభకు పంపిస్తోందని వర్ల రామయ్య ఆరోపించారు. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయని, నేర చరిత్ర గల వారిని ఓడించాలని తాను అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు విజ్ఙప్తి చేస్తున్నానని అన్నారు. దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ సన్నిహితుడికి వైఎస్ జగన్ రాజ్యసభ టికెట్ ఇచ్చారని, ఇది సరికాదని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయాలని తాము కేంద్రాన్ని కోరామని, దాన్ని నిరాకరించిందని అన్నారు.

English summary
Telugu Desam Party senior leader and APSRTC former Chairman Varla Ramaiah once again critised to Chief Minister YS Jagan Mohan Reddy and his government as Coronavirus outbreak. He strongly condemned YS Jagan for not aware to public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X