గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కీచక టీచర్: విద్యార్థులతో అసభ్య ప్రవర్తన, పేరెంట్స్ ఆందోళన, ఎంఈవో విచారణ

|
Google Oneindia TeluguNews

విద్యాబుద్దులు చెప్పాల్సిన టీచర్ దారితప్పాడు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పేరెంట్స్ ఆందోళనతో పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో రాధాకృష్ణ టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే అతను విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. టీచర్ వేధింపుల గురించి వారు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. టీచర్ రాధాకృష్ణ‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు కూడా స్పందించారు.

వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు..పోస్టులు: తెలంగాణ వాసి అరెస్ట్వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు..పోస్టులు: తెలంగాణ వాసి అరెస్ట్

teacher misbehave with primary scool students

పేరెంట్స్ ఫిర్యాదుపై ఎంఈవో స్పందించారు. విచారణ జరిపి టీచర్ రాధాకృష్ణపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు శాంతించారు. విద్యార్థులతో అతని ప్రవర్తన సరిగాలేదని ప్రజాసంఘాల నేతలు తప్పుపట్టారు. శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను కోరారు. మరోవైపు విద్యార్థి సంఘాల నేతలు కూడా టీచర్ వైఖరి సరికాదని దుయ్యబట్టారు.

సమాజంలో టీచర్‌కు మంచి స్థానం ఉందని విద్యార్థి నేతలు చెప్తున్నారు. వారి గౌరవం ఇనుమడింపజేసుకోవాలే తప్ప.. ఇలా ప్రవర్తించడం సరికాదంటున్నారు. ఒక్కరు చేసే తప్పు వ్యవస్థకు వర్తిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.

English summary
guntur district krosur village primary school teacher radha krishna misbehave with his students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X