గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ ఆఫీసు వద్ద మళ్లీ ఉద్రిక్తత-గాయపడ్డ కార్యకర్తల అంబులెన్స్ అడ్డగింత-విడిపించిన లోకేష్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న ఉద్రిక్తతలు వరుసగా రెండో రోజూ కొనసాగాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై నిన్న వైసీపీ శ్రేణుల దాడులతో మొదలైన ఉద్రిక్తత కొనసాగుతుండగానే.. ఇవాళ పోలీసులు టీడీపీ కార్యకర్తల్ని పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో నారా లోకేష్ రంగంలోకి దిగారు.

మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం వద్ద నిన్న వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తల్ని ఇవాళ ఆఫీసుకు రప్పించారు. దీంతో వారు అంబులెన్స్ లో పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. వీరిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకోవడమేంటని వారు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సమాచారం అందుకున్న పార్టీ ఎమ్మెల్సీ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్.. అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

tensions continue today at tdp central office, lokesh visit wounded tdp cadre amid police restrictions

పార్టీ కార్యాలయానికి వెళ్లే దారిలో కార్యకర్తల అంబులెన్స్ ను పోలీసులు ఆపేశారని తెలియడంతో అక్కడికి చేరుకున్న నారా లోకేష్ వారితో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపైనే నిరసనకు దిగారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. దీంతో ఆయన్ను కార్యకర్తలు కూడా అనుసరించారు. చివరికి పార్టీ కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు మరోసారి అంబులెన్స్ నిు అడ్డుకున్నారు. దీంతో లోకేష్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఆగ్రహంతో పోలీసులు వెనక్కి తగ్గారు. చివరికి టీడీపీ కేంద్ర కార్యాలయంలోకి కార్యకర్తల అంబులెన్స్ ను అనుమతించారు.

నిన్న వైసీపీ శ్రేణుల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.వీరిని ఇవాళ పార్టీ కార్యాలయానికి రప్పించి మీడియాకు చూపించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ లోకేష్ రాకతో పరిస్ధితి మారిపోయింది. లోకేష్ తో కాసేపు వాగ్వాదానికి దిగిన పోలీసులు చివరకు చేసేది లేక కార్యకర్తల వాహనాన్ని ఆఫీసులోకి అనుమతించారు.

English summary
tensions continue consecutive second day at tdp central office in mangalagiri today as mlc nara lokesh visited wounded tdp cadre amid police restrictions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X