గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాచర్ల దాడిలో గాయపడిన న్యాయవాది పరిస్థితి విషమం.. ఆవేదన వ్యక్తం చేసిన బోండా ఉమా

|
Google Oneindia TeluguNews

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో చోటు చేసుకున్న మాచర్ల ఘటన టీడీపీ నేతల తీవ్ర అసహనానికి కారణం అవుతుంది. మాచర్లలో టీడీపీ నేతల వాహనాలపై జరిగిన దాడి నేపధ్యంలో నెలకొన్న పరిస్థితులు ఇంకా సద్దు మణగలేదు. ఈ దాడిలో ఓ అడ్వకేట్ గాయపడిన విషయం తెలిసిందే . అయితే ఆ అడ్వకేట్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా .

ప్రాణాలతో వస్తామో లేదో ..!! చంద్రబాబుకు తమపై జరిగిన దాడిని చెప్పిన బొండా ఉమా , బుద్దా వెంకన్నప్రాణాలతో వస్తామో లేదో ..!! చంద్రబాబుకు తమపై జరిగిన దాడిని చెప్పిన బొండా ఉమా , బుద్దా వెంకన్న

 మాచర్ల ఘటనలో గాయపడిన హైకోర్టు న్యాయవాది పారా కిషోర్ పరిస్థితి విషమం

మాచర్ల ఘటనలో గాయపడిన హైకోర్టు న్యాయవాది పారా కిషోర్ పరిస్థితి విషమం

ఇటీవల గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై కొందరు పెద్ద, పెద్ద కర్రలతో, రాళ్ళతో దాడులు చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు . టీడీపీ నేతలకు సంబంధించిన స్థానిక ఎన్నికల నామినేషన్లను చించివేసి నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్న క్రమంలో అక్కడ పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్న వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు.ఇక మాచర్ల ఘటనలో గాయపడిన హైకోర్టు న్యాయవాది పారా కిషోర్ పరిస్థితి విషమంగా ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు.

తమపై మూడు చోట్ల దాడికి యత్నం .. తప్పించుకున్నామన్న బోండా ఉమా

తమపై మూడు చోట్ల దాడికి యత్నం .. తప్పించుకున్నామన్న బోండా ఉమా

తమపై దాడి చేసేందుకు మూడు చోట్ల ప్రయత్నాలు చేశారన్న ఆయన తాను, బుద్ధా వెంకన్న అదృష్టవశాత్తు తప్పించుకున్నామని, ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనలో గాయపడ్డ హైకోర్టు న్యాయవాది పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను తన సొంతానికి ఉపయోగించుకుంటోందని బోండా ఉమా విమర్శించారు.

ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు .. బెదిరిస్తున్నారని ఆగ్రహం

ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు .. బెదిరిస్తున్నారని ఆగ్రహం


టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే టీడీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు .ఈ ఎన్నికల్లో టీడీపీని అడ్డుకునే క్రమంలో దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు తమకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయన్నారు. బాబు, లోకేష్‌లను రాజకీయాల్లో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు.

Recommended Video

AP Local Body Polls: YSRCP MLA On Macherla Incident | టీడీపీ నేతలు మాచర్ల ఎందుకు వెళ్లారో చెప్పాలి ?
రాష్ట్ర పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదన్న బోండా ఉమా

రాష్ట్ర పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదన్న బోండా ఉమా


ఇక రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని వారే వైసీపీ నాయకులకు సమాచారాన్ని అందిస్తున్నారని, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బోండా ఉమా ధ్వజమెత్తారు.
అధికార పార్టీ అరాచకాలపై తాము గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి అక్రమాలు జరగకుండా చూసుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు .కానీ ఈసీ కూడా పట్టింపు లేనట్టు వ్యవహరిస్తుందని ఆయన అన్నారు . ఇక నిన్నటికి నిన్న చంద్రబాబు గవర్నర్ ను కలిసి మాచర్ల ఘటన విషయంలో చర్య తీసుకోవాలని కోరారు.

English summary
The macharla incident in the local bodies elections in AP will cause the TDP leaders to be very impatient. The situation in the wake of the attack on the vehicles of the TDP leaders in Matters has not yet subsided. An Advocate was injured in the attack. Former MLA Bonda Uma, however, says the Advocate's situation is serious .. his condition is still critical .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X