గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆదుకునే నాథుడు లేడు. ఇక అష్టదిగ్బంధనమే..! కోడెలకు సన్ తో పాటు డాటర్ స్ట్రోక్..!!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : విమానాల స్కాం చూసాం.., దానా స్కాం చూసాం.., బ్యాంకుల స్కాం చూసాం.., గృహాల స్కాం చూసాం.. కొత్తగా ఏపిలో ఫర్నిచర్ స్కాం చూస్తున్నాం. అది కూడా రాజకీయంగా ఓ ఉన్నత పదవి అలంకరించిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ప్రమేయం ఉండటం అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఒక్క పరాజయంతో ఏపిలో నరకం చూస్తున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా అంటే అందరూ ఆయన పేరుతే చెప్పుకొస్తున్నారు. గత ఏపి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలందరికి బాస్ వ్యవహిరించిన ఆయనను ఇప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పలకరించే పరిస్తితిలో లేరు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో మాట్లాడేందుకు జంకుతున్నారు. ఆయనకు చుట్టుముట్టిన వివాదాల తీవ్రత ఆ స్థాయిలో ఉంది మరి. ఇంతకీ ఎవరిగురించి చర్చించుకుంటున్నామో తెలిసిందిగా..! ఆయనే ఏపి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు. కోడెల శివప్రసాద్ తెలిసి చేసినా, తెలియక చేసినా, సన్ తో పాటు డాటర్ ఇచ్చిన స్ట్రోక్ తీవ్రత గట్టిగానే తగిలినట్టు తెలుస్తోంది.

దేశంలో ఎన్నో స్కాంలు బయట పడ్డాయి..! ఏపిలో వెలుగులోకి వచ్చిన ఫర్నిచర్ స్కాం..!!

దేశంలో ఎన్నో స్కాంలు బయట పడ్డాయి..! ఏపిలో వెలుగులోకి వచ్చిన ఫర్నిచర్ స్కాం..!!

మొన్న సత్తెనపల్లిలో వసూళ్ల పర్వం.. నిన్న గుంటూరులో ఫర్నిచర్ దొంగతనం.. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఏకంగా క్లీనికల్ ట్రయల్స్ చేసేందుకు బినామీ పేర్లతో లేబరేటరీ తో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు. నేడో.. రేపో.. అవన్నీ నిజాలనే తేలేది ఖాయమంటున్న అధికారులు. ఇటువంటి క్లిష్ట సమయంలో టీడీపీ తమ సహజమైన రాజకీయం ఉపయోగిస్తారు. కోర్టులను ఆశ్రయించి బయటపడేందుకు అనువైన అవకాశాలను వెతుకుతారు. కోడెల కూడా.. తనపై మోపిన ఐదు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దారులన్నీ ముసుకుపోతున్నాయి..! కోడెలకు అష్టదిగ్బంధనం తప్పదా..?

దారులన్నీ ముసుకుపోతున్నాయి..! కోడెలకు అష్టదిగ్బంధనం తప్పదా..?

ఇప్పటికే ఆసుపత్రి పాలైన కోడెలకు బెయిల్ అనారోగ్య రీత్యా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు న్యాయనిపుణులు. అయితే ఇక్కడ కోడెల స్పీకర్ హోదాలో తొలి నుంచి తప్పిదాలు చేస్తూనే వస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు తాను గౌరవపదవిలో ఉన్నాననే విషయాన్ని మరచి.. టీడీపీ కార్యకర్తగా వ్యవహరించి విపక్షాల నుంచి విమర్శలు చవిచూశారు. కే ట్యాక్స్ పేరిట కొడుకు, కూతుళ్లు దోచుకుంటుంటే చూసీచూడనట్టు వదిలేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేసులు నమోదుచేస్తే ఏం చేయాలనే అంశంలో పార్టీ నుంచి సరైన సాయం కూడా అందలేదు.

ఫర్నిచర్ స్కాం..! కోడెలను ఏకాకిని చేస్తున్న వివాదాలు..!!

ఫర్నిచర్ స్కాం..! కోడెలను ఏకాకిని చేస్తున్న వివాదాలు..!!

కోడెల అంటే ఉన్న అయిష్టం కూడా తెలుగు తమ్ముళ్లను.. ముఖ్యంగా పార్టీ సీనియర్లను వెనుకకు నెట్టేసింది. చివరకు చంద్రబాబు కూడా ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా కోడెల విషయంలో స్పందించకపోవటం కూడా పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతుంది. అసెంబ్లీ ఫర్నిచర్ తన వద్దనే ఉందని.. పైగా భద్రంగా ఉంచేందుకు మాత్రమే తన ఇంటికి తరలించానంటూ స్వయంగా అంగీకరించారు. కానీ తరువాత మాటమార్చి అది కనిపించట్లేదంటూ కోర్టుకు వెళ్లటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఫర్నిచర్ అంతా కూడా గుంటూరులో కోడెల తనయుడు శివరామక్రిష్ణ బైక్ షోరూంలో ఉండటం కొసమెరుపు.

తప్పుమీద తప్పులు..! కోడెల బయటపడటం సాద్యమేనా...?

తప్పుమీద తప్పులు..! కోడెల బయటపడటం సాద్యమేనా...?

దాదాపు పాతికలక్షల రూపాయలు కుమ్మరించి కొనుగోలు చేసిన టేబుల్ కూడా అక్కడే కనిపించిందట పోలీసులకు. ఇటువంటి సమయంలో కోడెల కోర్టులో చోరీ అయిందంటూ చెప్పటంపై కోర్టు ఎలా స్పందించనుందనేది కూడా ఉత్కంఠతగా మారింది. ఇప్పటికే యరపతినేని మైనింగ్ దోపిడీపై సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందట. రేపోమాపో.. చంద్రబాబు తన ఇలాఖాలో రానివ్వనంటూ గీతగీసి బయటకు నెట్టిన సీబీఐ ప్రవేశించనుందట. టీడీపీ అవినీతిపై దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు కూడా ప్రతికూలంగా స్పందిస్తున్న సమయంలో కోడెల వేసిన ఎత్తుగడ ఎంత వరకూ సఫలం అవుతుందనేది కూడా అనుమానమేనంటూ తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

English summary
The most obvious is the fact that Theft of furniture in Guntur yesterday.. Currently, Chittoor district is accused of indulging in a laboratory with Binami names to make clinical trials. today..or Tomorrow.. The authorities are sure that they are all true. At such a critical time, the TDP is used to their natural politics. And seek opportunities to get out of the courts. The Kodela also, He applied for early bail in the five cases that were levelled against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X