గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరు కానిస్టేబుళ్లు.. మధ్యలో కాంట్రాక్టు ఉద్యోగిని... ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ట్రాజెడి..

|
Google Oneindia TeluguNews

ఔను ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ కాంట్రాక్టు ఉద్యోగిని... ఆ ఉద్యోగిని కానిస్టేబుళ్లతోనే ప్రేమ నాటకం ఆడింది. ఓ కానిస్టేబుల్‌తో ప్రేమ, మరొకరితో మోజు అన్నట్టు ప్రవర్తించింది. చివరికి విషయం తెలిసి.. గాఢంగా ప్రేమించిన మరో ప్రేమికుడు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. గుంటూరు మంగళగిరిలో జరిగిన ఘటన ఏపీ పోలీసుశాఖలో చర్చకు దారితీసింది. కానిస్టేబుళ్లు, మహిళ ఉద్యోగినిపై పోలీసు బాస్ సీరియస్ అయ్యారు. ముగ్గురిని విధుల నుంచి తప్పించి.. గొడవకు పుల్‌స్టాప్ పెట్టారు.

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ

ట్రయాంగిల్ లవ్‌స్టోరీ

గుంటూరు మంగళగిరిలో ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని చనువుగా ఉంటుంది. అయితే వారిద్దరూ కూడా అదీ ప్రేమ అనుకొన్నారు. ఇదే గొడవకు కారణమైంది. ఆ యువతితో ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమ మైకంలో ముంచింది. కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాతే బెడిసికొట్టింది. తనతో కాక మరొకరితో కూడా చనువుగా ఉంటుందని ఓ కానిస్టేబుల్ తెలుసుకున్నాడు. ఆమె ఎవరిని ప్రేమిస్తుందో తెలియక జుట్టు పీక్కున్నాడు. ఏం చేయాలో తోచాలేదు, ఎవరినీ సలహా అడగాలో తెలియలేదు.

మోసం, వంచన

మోసం, వంచన

కాంట్రాక్టు ఉద్యోగిని తనను మోసం చేసిందని మదనపడ్డారు. మరో కానిస్టేబుల్‌తో సన్నిహితంగా మెలగడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తనకు జీవితం చాలు అని అనుకొన్నాడు. ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. పొలంలో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అయితే సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో.. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

 సస్పెండ్

సస్పెండ్

సూసైడ్ చేసుకోబోతున్న కానిస్టేబుల్‌ను కాపాడారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులు తెలిసింది. కానిస్టేబుళ్లు, మహిళా ఉద్యోగి ప్రవర్తనపై ఎస్పీ సీరియస్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉండి.. ఏంటీ ఈ ప్రవర్తన అని మండిపడ్డారు. ఇద్దరు కానిస్టేబుళ్లు సహా.. మహిళా ఉద్యోగిని కూడా విధుల నుంచి తప్పించారు. దీంతో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి పుల్ స్టాప్ పడినట్లైంది.

సర్వత్రా విమర్శలు

సర్వత్రా విమర్శలు

కానీ కానిస్టేబుళ్లు, మహిళా ఉద్యోగి ప్రవర్తనపై మాత్రం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నలుగురికి మంచి చెప్పాల్సిన ఖాకీలు.. ప్రేమ గోల ఏంటీ అని నోరెళ్లబెట్టారు. దీనికితోడు ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఏంటీ అని వాపోతున్నారు. ఖాకీలు, ఉద్యోగులు.. జనానికి మంచి చెప్పాలే గానీ, చెడు గురించి ప్రభావితం చేయకూడదని హితవు పలుకున్నారు.

English summary
one constable suicide attempt in guntur mangalagiri. he feel contract employee close to another constable
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X