గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గిరిజన మహిళా రైతు హత్య..?: ట్రాక్టర్‌తో తొక్కించిన వైసీపీ నేత శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్..?

|
Google Oneindia TeluguNews

గిరిజన రైతు రమావత్ మంత్రూబాయిని ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ట్రాక్టర్ తో తొక్కించిన శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. దీంతో మృతురావలి బంధువులు శాంతించారు. అంతకుముందు మంగళవారం ఉదయ నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రమావత్ బంధువులు ఆందోళన చేపట్టారు. నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వారి ఆందోళన నేపథ్యంలో పోలీసులు స్పందిస్తూ.. శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

గుంటూరు జిల్లా నకరికల్లు శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రూబాయి, మంత్రూనాయక్ భార్యాభర్తలు. అటవీభూముల్లో సాగుచేసుకుంటున్నారు. అలా రెండున్నర ఎకరాల భూమిపై హక్కులు పొందారు. రెండేళ్ల కిందట ఆ పొలం పనులు, ఇంటి అవసరాల నిమిత్తం అప్పు తీసుకున్నారు. నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి రూ.3.80 లక్షలు అప్పు ఇఛ్చాడు. తీసుకున్న అప్పు, వడ్డీ తీర్చకపోవడంతో.. శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. ఇదే విషయమై ఇద్దరికీ గొడవలు కూడా జరిగాయి.

tribal farmer ramavath murder case: ycp leader srinivas reddy arrest

Recommended Video

A Petition Filed In Madras High Court Against Virat Kohli & Tamannah Bhatia || Oneindia Telugu

అప్పు తీర్చకపోగా.. పొలంలో పనులు చేసుకునేందుకు రమావత్ దంపతులు వెళుతున్నారు. దీంతో కోపం పెంచుకున్న శ్రీనివాసరెడ్డి.. మంత్రూబాయి, మంత్రూనాయక్‌ను తన ట్రాక్టర్‌తో అడ్డుకున్నాడు. మాటామాటా పెరగడంతో ట్రాక్టర్‌తో మంత్రూబాయిని తొక్కించాడు. దాంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. ఘటనపై నారా లోకేశ్, టీడీపీ అనిత కూడా మండిపడ్డారు. జే గ్యాంగ్ అరాచకాలు అంటూ ధ్వజమెత్తారు.

English summary
tribal farmer ramavath murder case police arrested ycp leader srinivas reddy. today ramavath family members agitation at narsaraopet government hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X