టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులు ... వైసీపీ సోషల్ మీడియాపై వర్ల రామయ్య ఫిర్యాదు ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతూనే ఉంది . సామాజిక మాధ్యమాల్లో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇప్పటికే టీడీపీ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల విజయవాడలో పోలీసులకు తనతో పాటు చంద్రబాబుపై అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య ఇప్పుడు మరోమారు గుంటూరు లోని అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వర్ల రామయ్యకు నోటీసులు ఇచ్చిన జగన్ సర్కార్ .. రాజీనామా చెయ్యండి .. లేదంటే ...
వైసీపీ సోషల్ మీడియా టీడీపీ నేతలపట్ల అసభ్యకరమైన పోస్ట్ లు పెడుతూ మానసిక క్షోభకు గురి చేస్తుందని ఆయన మండిపడుతున్నారు. ఇక ఈ నేపధ్యంలో అరండల్పేట పోలీసులకు టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో పాటు మహిళా నేతలను కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా పెడుతున్న పోస్టులతో మానసిక క్షోభకు గురవుతున్నామని వెల్లడించారు. పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను వర్ల రామయ్య కోరారు.

ఇక గత నెలలో వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి తనను కులం పేరుతో దూషించారని , అలాగే చంద్రబాబును అసభ్య పదజాలంతో సోషల్ మీడియా వేదికగా తిట్టారని ఆయన విజయవాడ నగర కమీషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. ఇపటికే పలు సందర్భాల్లో వైసీపీ మీడియాపై ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.సోషల్ మీడియా వేదికగా వైసీపీ టీడీపీ నేతలను చాలా అవమానిస్తున్నారని, మానసికంగా బాధ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ సోషల్ మీడియా మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!