గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్ నాయుడును కాబోయే సీఎంగా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర : చంద్రబాబుపై విజయసాయి వ్యంగ్యం

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పై విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్ నే కాకుండా టిడిపి నేతలను సైతం తూర్పారబడుతున్నారు . టీడీపీ నేతలు పదిమంది మాట్లాడితే విజయసాయి ఒక్కడే సమాధానం ఇస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపైనా , లోకేష్ పైనా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

నా పేరు చెప్పి భూ సెటిల్‌మెంట్లు చేస్తే ఎవ్వర్నీ వ‌ద‌ల‌ను : ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్నా పేరు చెప్పి భూ సెటిల్‌మెంట్లు చేస్తే ఎవ్వర్నీ వ‌ద‌ల‌ను : ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్

టీడీపీ విమర్శలను తిప్పికొడుతున్న విజయసాయి

టీడీపీ విమర్శలను తిప్పికొడుతున్న విజయసాయి


వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, అలాగే మాజీ మంత్రి లోకేష్ పై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఏపీ, వైసిపి పాలనలో అవినీతి అక్రమాలకు అడ్డాగా మారుతోందని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ఆ విమర్శలను తిప్పికొడుతూనే విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రతి విషయంలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేసిన ఆయన వ్యంగ్యంగా ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

 బాబుగారు ... జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట!

బాబుగారు ... జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట!

పార్టీ వ్యవహారాలను కొడుకుకు అప్పగించాలని బాబు గారు అనుకుంటున్నారా? వయసు పెరగడం, జ్ఞాపకశక్తి క్షీణించడంతో కుమారుడికి పగ్గాలు ఇస్తారంట. కరోనా ఉద్ధృతి తగ్గగానే లోకేష్ నాయుడు ను కాబోయే సీఎం గా ఎలివేట్ చేసేలా సైకిల్ యాత్ర చేయించాలని ఎల్లో మీడియా ముఖ్యులు రూట్ మ్యాప్ ఇచ్చారంట అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. చంద్రబాబుకు వయస్సు అయిపోయిందని, అందుకే లోకేష్ ను నిజంగా ఎలివేట్ చేసే పనిలో పడ్డాడని ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి .

సీబీఐ వంటి కేంద్ర సంస్థలు ఏపీలోకి రావొద్దన్న నోటితోనే సీబీఐ విచారణ కోరుతున్న బాబు

సీబీఐ వంటి కేంద్ర సంస్థలు ఏపీలోకి రావొద్దన్న నోటితోనే సీబీఐ విచారణ కోరుతున్న బాబు

తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై సిబిఐ విచారణ కావాలని టిడిపి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో ఆసక్తి కరమైన ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. బాబు నాయుడు ప్రధానిని ఆయన కుటుంబాన్ని తిట్టిన నోటితోనే ఆయన నాయకత్వాన్ని పొగిడారు. సి.బి.ఐ, ఈడీ, ఎన్ ఐ ఏ, ఐ టి వంటి కేంద్ర సంస్థలు ఏపీ లోకి రావడానికి వీలు లేదు అన్న నోటితోనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విచారణ కావాలంటున్నారు. ఇంకా ఇలాంటి చిత్ర,విచిత్రాలు, విడ్డూరాలు ఎన్ని చూడాలో మరి అని విమర్శలు గుప్పించారు.

ఏపీలో రగులుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

ఏపీలో రగులుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం

గతంలో సిబీఐ ఏపీలో అడుగు పెట్టడానికి వీలులేదని ఆర్డర్ పాస్ చేసిన చంద్రబాబు ప్రస్తుతం ప్రతి వ్యవహారంలోనూ సిబిఐ విచారణ కోరడాన్ని విజయసాయి తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రగులుతున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తగ్గకుండా విమర్శలు గుప్పిస్తున్నారు . ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని టిడిపి, అయితే ఆధారాలు చూపించండి అంటూ వైసిపి ఒకరిమీద ఒకరు నిప్పులు చెరుగుతున్నారు . న్యాయవ్యవస్థ మీద కూడా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఒక ఐపీఎస్ కి బాధ్యత అప్పగించి మరి నిఘా పెట్టిందని కోర్టులోనూ విచారణలు కొనసాగుతున్నాయి . ఏది ఏమైనా ఏపీ లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉప్పు నిప్పులా మండిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

English summary
Vijayasaray Reddy tweeted, that Does Babu want to hand over party affairs to his son? As he grows older and his memory deteriorates, his son will be given the reins. He posted that the yellow media chiefs should give a route map to Lokesh Naidu to cycle tour to elevate him as the future CM as soon as the corona is reduced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X